భారత్ జో డో యాత్ర( Bharat Jodo Yatra ) ద్వారా తనను తాను నిరూపించుకున్న రాహుల్ గాంధీ ఇప్పుడు ఒక దేశంలోని ముఖ్య నాయకుడు గా గుర్తింపు పొందారని ఏదో ఒక రోజు దేశానికి నాయకత్వం కచ్చితంగా వహిస్తారు అంటూ ఎన్సిపి అధ్యక్షుడు, ఇండియా కూటమి కీలక నాయకుడు శరద్ పవార్ వ్యాఖ్యానించారు .ఇండియా కూటమి ఏర్పడిన దగ్గర్నుంచి ప్రధాన మంత్రి పదవిపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయని, ఇప్పటికీ ప్రధాన మంత్రి పదవిపై ఆ కూటమి అభ్యర్థి ఫైనల్ కాలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో మారాటా యోధుడు శరత్ పవర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
రాహుల్ నాయకత్వం వహిస్తారని ప్రకటించడం ద్వారా ఇండియా కూటమి లో పెద్దన్న పాత్ర కాంగ్రెస్ దేనని,కూటమి అనుకున్న సీట్లు సాధిస్తే ప్రధానమంత్రి పదవికి రాహుల్(Rahul gandhi ) ప్రథమ స్థానంలో ఉన్నాడని ఈ రాజకీయ కురువృద్రుడు ధ్రువీకరించినట్లయ్యింది .
అంతేకాకుండా ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల తకరారు ఒక కొలిక్కి రాలేదని ఇది కూటమికి చాలా చేటు చేస్తుందన్న ప్రశ్నల పై కూడా శరద్ పవార్( Sharad Pawar ) స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేశారు.తమ ప్రధాన పార్టీలన్నీ సీట్ల కేటాయింపు పై సరైన అవగాహనతోనే ఉన్నాయని ఢిల్లీలో ఉన్న ఏడు పార్లమెంటు స్థానాలలో మూడుస్థానాలు కాంగ్రెస్కు ఇవ్వడానికి ఇప్పటికే ఆప్ అంగీకరించిందని అంతేకాకుండా తమ ప్రధాన పార్టీలన్నీ సీట్ల కేటాయింపు పై సరైన అవగాహనతో ముందుకు వెళ్తున్నందున తమ కూటమి కచ్చితంగా అధికార బాజాపా ను ఓడిస్తుందనే ధీమాను శరద్ పవార్ వ్యక్తం చేశారు.తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని ఇప్పటికే ప్రకటించిన ఆయన తమను వీడి భాజాపాకు వెళ్ళిన వారు కూడా అంత సంతోషం గా లేరంటూ అజిత్ పవార్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టుగా ప్రచారం జరుగుతుంది.