తెలుగు బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు యాంకర్ అనసూయ భరద్వాజ్( Anasuya bharadwaj ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఒకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు వెండితెర పై సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది.
కాగా ఇప్పటికే రంగస్థలం, పుష్ప( Pushpa ) లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం బోలెడు సినిమా అవకాశాలతో బిజీ బిజీగా గడుపుతోంది.
కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ.ఈ ముద్దుగుమ్మ చేతిలో అర డజైన్ కు పైగా సినిమాలు ఉన్నాయి.

కాగా మొన్నటి వరకు యాంకర్ గా తన సత్తాను చాటిన అనసూయ ప్రస్తుతం నటిగా మరి వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.అయితే అనసూయ నటించిన సినిమాలు అన్నీ మంచి సూపర్ హిట్ అవుతుండడంతో ఈ ముదుగుమ్మకు వరుసగా అవకాశాలు వచ్చి చేరుతున్నాయి.సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తరచూ సోషల్ మీడియా( Social media )లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
వరుస గ్లామర్ ఫోటో షూట్స్ తో యువతకు అందాలు కనువిందు చేస్తూ ఉంటుంది.ఇక తన పై ట్రోలింగ్స్ నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి తనదైన శైలిలో స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ తన అభిమానులతో చిట్ చాట్ చేసింది.ఈ నేపథ్యంలోనే నెటిజన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో తన ఒంటిపై ఉన్న టాటూల విషయం గురించి ఓపెన్ అయింది.మీ ఒంటి మీదున్న టాటూల గురించి చెప్పండి అని ఒక నెటిజన్ అడగడంతో.
నా ఒంటి మీద రెండు టాటూలు ఉన్నాయి.మొదటి టాటూని నా ఫస్ట్ ఎంగేజ్మెంట్ యానివర్సరీ, మా ఆయన బర్త్ డే ఒకేసారి రావడంతో వేయించుకున్నాను.
అది నిక్కు మా ఆయన పేరు.రెండోది కేలన్.గ్రీకు భాషలో కారెక్టర్ బ్యూటీ అని క్లియర్‌గా వివరించింది.







