అదిరిపోయే అప్‌డేట్‌పై పనిచేస్తున్న వాట్సాప్.. ఫుల్ ప్రైవసీ గ్యారంటీ!

నంబర్ వన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్( WhatsApp ) నిత్యం అదిరిపోయే అప్‌డేట్స్‌తో వినియోగదారుల భద్రతకు మరింత సెక్యూరిటీ ఇస్తోంది.అయితే ఎంత సెక్యూరిటీ ఇస్తున్నప్పటికీ ఈ మెసేజింగ్ యాప్స్‌లో భద్రతాపరంగా ఇప్పటికీ కొన్ని లోపాలు వుండనే ఉన్నాయని చెప్పుకోవడంలో సందేహమే లేదు.

 Whatsapp Is Working On An Exciting Update Full Privacy Guarantee, Whatsapp, Late-TeluguStop.com

వాటిలో ఒకటి ఫోన్ నంబర్ హైడ్ చేయలేకపోవడం.అవును, ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లో ఫోన్ నంబర్‌ను ఇవ్వకుండా/రివీల్ చేయకుండా ఇతరులతో కమ్యూనికేట్ అవ్వడం అస్సలు కుదరదు.

Telugu Latest, Phone Number, Privacy, Usernames, Whatsapp-Technology Telugu

మరీ ముఖ్యంగా కొత్త వ్యక్తులతో లేదా గ్రూప్స్‌లో చాట్ చేస్తున్నప్పుడు ఫోన్ నంబర్‌ దాచడం అస్సలు సాధ్యం కావడం లేదు.దీనివల్ల ప్రైవసీకి భంగం వాటిల్లుతోందని కొందరు వినియోగదారులు తమ సమస్యని లేవనెత్తారు.దాంతో దీనికి పరిష్కారంగా వాట్సాప్ యూజర్‌నేమ్స్( Whatsapp usernames ) పేరుతో ఒక ప్రైవసీ ఫీచర్ తెచ్చేందుకు రెడీ అయ్యింది.అవును, ఆండ్రాయిడ్ , iOS రెండింటికీ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి వాట్సాప్ డెవలపర్లు పనిచేస్తున్నారు.

Telugu Latest, Phone Number, Privacy, Usernames, Whatsapp-Technology Telugu

వాట్సాప్ బీటా ఇన్ఫో రిపోర్ట్( WhatsApp Beta Info Report ) ప్రకారం, కొత్త ఫీచర్‌తో యూజర్లు ప్రొఫైల్ సెక్షన్‌లో యూజర్‌నేమ్స్‌ ను క్రియేట్ చేసుకోవచ్చు.అప్పుడు వాట్సాప్‌లో తెలియని వారితో కమ్యూనికేట్ చేసేటప్పుడు ఫోన్ నంబర్ అనేది కనిపించకుండా, కేవలం మీ యూజర్‌నేమ్స్‌ మాత్రమే కనిపిస్తాయి.తద్వారా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్‌ను ఎవరితో షేర్ చేసుకోవాలో యూజర్ సొంతంగా నిర్ణయించుకోవచ్చన్నమాట.కొత్త వారితో షేర్ చేయొద్దు అనుకుంటే కమ్యూనికేట్ అవ్వడానికి యూజర్ నేమ్స్ వాడితే సరిపోతుంది.

ఈ సేఫ్టీ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్‌ స్టేజ్‌లోనే ఉందని, వాట్సాప్ యాప్‌ ఫ్యూచర్ అప్‌డేట్‌లో విడుదల కావచ్చని వాట్సాప్ బీటా ఇన్ఫో రిపోర్టు వెల్లడించింది.కాగా ప్రస్తుతం దీని మీద వర్క్ జరుగుతోంది.

త్వరలోనే దీని గురించి వాట్సప్ ఓ కీలక ప్రకటన చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube