హైదరాబాద్ లో వ్యాపారి హత్య తీవ్ర కలకలం సృష్టిస్తుంది.సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి, నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.
ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన గోపాలపురం పోలీసులు కీలక విషయాలు తెలుసుకున్నారు.మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి కాట్రగడ్డ రవినే అంజిరెడ్డిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని పోలీసులు తెలిపారు.
గత నెల 29వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కాగా అంజిరెడ్డి ఆస్తుల కోసమే ఈ హత్య చేసినట్లుగా తెలుస్తోంది.
ఆస్తులను అమ్మి అమెరికాకు వెళ్లిపోవాలనుకున్న అంజిరెడ్డి తన ఆస్తులను అమ్మే బాధ్యతను రవికి అప్పగించాడు.ఈ క్రమంలో ఆస్తులన్నింటీన తన పేరు రాయించుకున్న రవినే ఈ హత్యకు ప్లాన్ చేశాడని పోలీసులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీహారీలకు సుపారీ ఇచ్చి అంజిరెడ్డిని హత్య చేయించారని తెలుస్తోంది.ఈ క్రమంలో నిందితుడు కాట్రగడ్డ రవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.







