తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )తీసుకున్న నిర్ణయం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది .ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టి ఎన్నికల కేంద్రంగా కష్టపడుతున్న జనసేన అధ్యక్షుడు ఈసారి 2024 అసెంబ్లీ ఎన్నికలలో జనసేన ను ఆంధ్ర ప్రదేశ్ లో క్రియాశీలక పాత్ర పోషించే విధంగా తయారు చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు।.

దానికి తగ్గట్టే వారాహి విజయ యాత్రలు, కార్యకర్తలతో సభలు సమావేశాలతో రాజకీయాన్ని పరుగులు పేట్టిస్తున్నారు.మరోపక్క తెలుగుదేశంతో పొత్తు ప్రకటన , ప్రతిపక్ష నేత అరెస్టు వంటి వ్యవహారాలతో ఆయన ఫుల్ బిజీ అయిపోయారు.ఇలాంటి సమయంలో తెలంగాణ ఎన్నికలలో 32 స్థానాలలో జనసేన పోటీ చేస్తుంది అని ప్రకటించడం వెనక వ్యూహం ఏమిటా అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.తెలంగాణ లో గతం లో ప్రాంతీయ ఎన్నికలలోనే పోటీ చేస్తామని చెప్పి చివరి నిమిషంలో విరమించుకొని బిజెపికి( BJP ) మద్దతు ఇచ్చిన జనసేన, ఈసారి తెలంగాణలో మాకు ఎవరితోనూ పొత్తు లేదు అని నిరూపించడానికే ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేక బారసా తో ఉన్న అవగాహన మేరకు వ్యతిరేక ఓటును చీల్చడానికి జనసేన పోటీ చేస్తుదన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

అయితే దీర్ఘకాల రాజకీయ ప్రయాణాన్ని ఆశించి వచ్చిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రస్తుతం నామమాత్రపు ప్రభావమే చూపించగలిగినప్పటికీ భవిష్యత్తులో జాతీయస్థాయిలో ప్రభావం చూపాలంటే తెలంగాణలో కూడా ఓటు బ్యాంక్ ను పెంచుకోవాలని, కొత్త తరం నాయకులను తయారు చేయవలసిన సమయం ఇదేనని బావించి తెలంగాణలో పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.అయితే ఈ ఎన్నికలలో కనీస ప్రభావం కూడా చూపించకపోతే అది ఆంధ్ర ఎన్నికలకు సరికొత్త ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉందన్న అంచనాలను జనసేన పార్టీ ( Janasena party )ఏ మేరకు పట్టించుకుంటుందో చూడాలి