నెదర్లాండ్స్‌లోని( Netherlands ) రోటర్‌డామ్‌లో ఓ దుండగుడు ముగ్గురిని తుపాకీతో కాల్చి చంపేశాడు.వారిలో ఒక మహిళ, ఆమె కుమార్తె, ఒక మగ ఉపాధ్యాయుడిని ఉన్నారు.
నిందితుడు 32 ఏళ్ల యూనివర్సిటీ విద్యార్థి అని పోలీసులు గుర్తించారు.ఈ యువకుడు మహిళ (39), ఆమె కుమార్తె (14)ను వారి ఇంటిలో కాల్చి చంపేశాడు, ఆపై రోటర్‌డామ్ యూనివర్సిటీలో ఎరాస్మస్ మెడికల్ సెంటర్‌లోకి( Erasmus Medical Centre ) వెళ్లి తరగతి గదిలో టీచర్‌ను కాల్చాడు.
దుండగుడు రోటర్‌డామ్ మెడికల్ సెంటర్ యూనివర్సిటీ ఆసుపత్రికి వెళ్లి 43 ఏళ్ల టీచర్‌ను తరగతి గదిలో కాల్చి చంపాడని తెలిపారు.

ఆసుపత్రి సమీపంలోనే కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశారు.వీరిని ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశాడో తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.ఈ భయంకరమైన సంఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యామని, నగరంలో రెండు వేర్వేరు ప్రదేశాలలో కాల్పులు జరిగాయని, చాలా మంది దీనిని చూశారని రోటర్‌డామ్ మేయర్ అహ్మద్ అబౌటలేబ్( Mayor Ahmed Aboutaleb ) అన్నారు.“నగరంలో ప్రజలు చాలా కలత చెందుతున్నారు.బాధితులకు నా సానుభూతి.” అని పేర్కొన్నారు.

ఈ కాల్పులకు ముందే నిందితుడి నేర చరిత్ర ఉంది.అతను 2021లో జంతు హింసకు పాల్పడ్డాడు.ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వీడియోలలో సాయుధ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోవడం, విద్యార్థులను బయటకు పరుగెత్తమని చెబుతున్నట్లు కనిపించాయి.
ఒక వీడియో మిలటరీ పర్సన్స్ ధరించే ప్యాంటు ధరించి చేతికి సంకెళ్లతో ఓ వ్యక్తి కనిపించాడు.కాల్పులు జరిపినప్పుడు నేరస్థుడు బుల్లెట్ ప్రూఫ్ చొక్కా ధరించినట్లు సమాచారం.
కాల్పులు జరిపింది ఒక్కరేనని మరొక వ్యక్తి అంటూ ఎవరూ లేరని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.







