కీరవాణిని భయపెట్టిన 'చంద్రముఖి 2'.. కారణం ఇదే!

మన టాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎం ఎం కీరవాణి( M M keeravani ) ఒకరు.ఈయన గురించి చెప్పాల్సిన పని లేదు.

 M M Keeravani Interesting Comments On Chandramukhi 2, Chandramukhi 2, M M Keer-TeluguStop.com

కొన్ని దశాబ్దాల నుండి ఈయన ప్రయాణం స్టార్ట్ అయ్యింది.ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన కీరవాణి ఆర్ఆర్ఆర్ సినిమా( RRR )కు అందించిన నాటు నాటు సాంగ్( Natu Natu Song ) తో ఇండియన్ సినిమాకు ఆస్కార్ తెచ్చాడు.

ఈ సినిమాకు ఆస్కార్ రావడంతో తెలుగు సినిమా జాతిని మరో స్థాయికి తీసుకు వెళ్లేలా ఈయన కృషి పాటుపడింది.

Telugu Chandramukhi, Kangana Ranaut, Kollywood, Keeravani, Natu Natu, Rajinikant

మరి అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమాకు సంగీతం అందించడానికి భయపడ్డారట.ఆ సినిమా ఏంటి అంటే.? చంద్రముఖి 2 అట.కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ ( Rajinikanth )కెరీర్ లో మరపురాని సినిమాలలో చంద్రముఖి ఒకటి.ఈ సినిమాను ఇప్పుడు కూడా మరోసారి చూసేందుకు ఆడియెన్స్ రెడీగా ఉంటారు.2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు భాషలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ఈ సినిమాను పి వాసు డైరెక్ట్ చేయగా.ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ గా చంద్రముఖి 2 రాబోతుంది.18 ఏళ్ల తర్వాత చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 తెరకెక్కుతుండగా పాన్ ఇండియన్ లెవల్లో హర్రర్ థ్రిల్లింగ్ గా రూపొందుతుంది.

Telugu Chandramukhi, Kangana Ranaut, Kollywood, Keeravani, Natu Natu, Rajinikant

అయితే ఈసారి హీరోగా రజనీకాంత్ కూడా బదులుగా రాఘవ లారెన్స్( Raghava Lawrence ) ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ( Kangana Ranaut )హీరోయిన్ గా నటిస్తుంది.ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాకు సంగీతం అందించడంలోనే కీరవాణి ఇబ్బంది పడ్డారట.ఎందుకంటే ఈ సినిమాకు ముందు గురుకిరణ్, విద్యాసాగర్ సంగీతం పరంగా మార్కును సెట్ చేసారు.ఆ మార్కును తట్టుకుని నేను పనిచేయడం కష్టం అయ్యింది అంటూ ట్యూన్స్ సమయంలో కన్ఫ్యూజన్ ఎదుర్కొన్నాను అంటూ కీరవాణి తెలిపారు.

అయితే నా వంతుగా అన్నిటిని దాటుకుని సంగీతం ఇచ్చానని మీకు తప్పకుండ నచ్చుతుందని ఈయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube