ఆధారం లేని కేసులో చంద్రబాబును ఇరికించారు..: అచ్చెన్నాయుడు

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కుటుంబ సభ్యులతో పాటు ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు ములాఖత్ ముగిసింది.చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి క్యాంపు నుంచి జైలుకు వెళ్లారు.

 Chandrababu Was Implicated In A Baseless Case..: Achchennaidu-TeluguStop.com

వీరితో పాటు అచ్చెన్నాయుడు కూడా చంద్రబాబును కలిశారు.

ములాఖత్ ముగిసిన అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆధారం లేని కేసులో చంద్రబాబును ఇరికించారని తెలిపారు.

కావాలనే కుట్ర పూరితంగా తప్పుడు కేసులో ఇరికించి జైలులో పెట్టారని మండిపడ్డారు.ఇటువంటి కేసును యావత్ భారతదేశంలోనే ఎప్పుడూ చూసి ఉండరని చెప్పారు.

ఇవాళ్టికి 16 రోజులు గడిచినా కేసులో చిన్న ఆధారం కూడా లేదని చెప్పారు.రెండు రోజులపాటు జరిగిన సీఐడీ అధికారుల విచారణలో చంద్రబాబుకు 33 పనికిమాలిన ప్రశ్నలు వేశారని తెలిపారు.

ఈ క్రమంలో అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు లాయర్లతో చర్చించి సమాధానం ఇస్తామని పేర్కొన్నారు.దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రూ.300 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జైల్లో పెట్టారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube