సాధారణంగా కొందరికి పొడవాటి జుట్టు అంటే చాలా ఇష్టం. పొడవాటి జుట్టు( Long hair ) అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది అనడంలో సందేహం లేదు.
అందుకే జుట్టును పొడుగ్గా పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? లాంగ్ హెయిర్ కోసం ఆరాటపడుతున్నారా.? జుట్టును పొడుగ్గా పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ సూపర్ ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటిస్తే మీ జుట్టు ఎంత పొట్టిగా ఉన్నా సరే రెండు నెలల్లో పొడుగ్గా మారుతుంది.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek ), రెండు టేబుల్ స్పూన్లు డ్రై రోజ్ మేరీ ఆకులు వేసి ఒక కప్పు వాటర్ పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న పదార్థాలను వాటర్ తో సహా వేసుకోవాలి.అలాగే రెండు తుంచిన మందారం ఆకులు, ( Hibiscus )రెండు మందారం పువ్వులు వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ) వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ హోమ్ రెమెడీని పాటిస్తే హెయిర్ గ్రోత్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.
జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.జుట్టు చివర్లు చిట్లడం, పొట్లిపోవడం వంటివి కంట్రోల్ అవుతాయి.
మీ జుట్టు ఎంత పొట్టిగా ఉన్నా సరే ఈ రెమెడీని పాటించడం స్టార్ట్ చేశారు అంటే కొద్ది రోజుల్లోనే పొడుగ్గా మారుతుంది.కాబట్టి పొడవాటి జుట్టును కోరుకునేవారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.