బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ఒకరు.ఈ భామ ఇప్పుడు తెలుగు తెరపై సందడి చేసేందుకు రెడీ అవుతుంది.
ధఢక్ సినిమాతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ డాటర్ ఈ సినిమాతో అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుని తన వైపుకు తిప్పుకుంది.ఈ సినిమా సూపర్ హిట్ అవ్వక పోయిన జాన్వీ అందం, నటనకు మంచి పేరు అయితే వచ్చింది.
ప్రెజెంట్ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే సౌత్ ఎంట్రీకి కూడా సిధ్దం అవుతుంది.జాన్వీ కపూర్ దేవర సినిమాతో తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. కొరటాల శివ ( Koratala Shiva )దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ”దేవర” ( Devara )వంటి భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.
జాన్వీకి ఇదే తొలి పాన్ ఇండియన్ మూవీ కావడం విశేషం.అందుకే ఈ సినిమా కోసం ఈమె చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తుంది.ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుగుతుంది.కాగా ఈమె ఫస్ట్ లుక్ సైతం అందరిని ఆకట్టుకుంది.ఈ సినిమాతో ఈమెకు గ్రాండ్ ఎంట్రీ ఖాయం అని తెలుస్తుంది.ఇదిలా ఉండగా ఈ భామ సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
తాజాగా ఈమె బ్లూ కలర్ మినీ డ్రెస్ లో హాట్ లుక్స్ తో ఆకట్టుకుంది.ఈ డ్రెస్ ఖరీదు తెలిసి అంత నోరెళ్ళ బెడుతున్నారు.డేవిడ్ కోమా బ్రాండ్ కు చెందిన ఈ షార్ట్ డ్రెస్ ఏకంగా 80 వేల రూపాయలట.ఇది విని వామ్మో ఇంత చిట్టి డ్రెస్ కే ఇంత ధర అంటూ షాక్ అవుతున్నారు.
ఈ ముద్దుగుమ్మ చీర నుండి బికినీ వరకు లేటెస్ట్ మోడల్స్ లో మెరిసి మరింత క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకు పోతుంది.