పంటలలో కలుపు నివారణకు యాజమాన్య పద్ధతులు..!

పంటకు జరిగే నష్టాలలో కలుపు( Weeds ) ప్రధాన పాత్ర పోషిస్తుంది.వర్షాలు కురిసినప్పుడు భూమిలో ఉన్నటువంటి కలుపు విత్తనాలు మొలకెత్తి కలుపు మొక్కలు పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.

 Problematic Weeds Integrated Control Methods Details, Weeds , Weeds Control Meth-TeluguStop.com

పంట మొక్కలకు అందాల్సిన నీరు, పోషకాలు, సూర్యరశ్మి ను కలుపు మొక్కలు గ్రహించడం వల్ల చీడపీడల బెడద( Pests ) పెరిగి పంట నాణ్యత తగ్గుతుంది.ఏ పంట వేసిన కలుపు నివారించే పద్ధతులను పాటించాలి.

వరి నారుమడి:

ఉదా మరియు వెడల్పాకు కలుపు మొక్కలను నివారించేందుకు విత్తిన 15 రోజులకు ఒక ఎకరాకు 100 మిల్లీలీటర్ల బిస్ పైరిబాక్ సోడియం 10% ద్రావణంను 200మీ.లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

వరి పొలం:

వరి( Rice ) నాటిన ఐదు రోజులలోపు పొలంలో ఐదు సెంటీమీటర్ల వరకు నీరు నిలువ గట్టి ఒక లీటరు నీటిలో 8 గ్రాముల పైరజోస సల్ఫ్యూరాన్ ఇథైల్ 10 శాతం డబ్ల్యూపి ను కలిపి ఇందులో 20 కిలోల పొడి ఇసుక కలుపుకొని పొలంలో సమానంగా చల్లుకోవాలి.

Telugu Cotton, Crop Weeds, Crops, Paddy, Pendimethalin, Weed, Weeds, Weedscontro

కంది, పెసర:

విత్తిన 48 గంటల లోపు తేమ ఉండే నేలపై ఒక ఎకరానికి ఒకటి పాయింట్ ఆరు లీటర్ల పెండిమిథాలిన్( Pendimethalin ) 30శాతం ద్రావణంను 200 మీ.లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేయాలి.గడ్డి జాతి కలుపు అధికంగా ఉంటే ఫెనాక్సీప్రాస్- ఇథైర్ 9శాతం ద్రావణం 250 మీ.లీ ను 200 లీటర్ల నీటిలో కలుపుకొని పంటకు పిచికారి చేసుకోవాలి.

Telugu Cotton, Crop Weeds, Crops, Paddy, Pendimethalin, Weed, Weeds, Weedscontro

మొక్కజొన్న:

విత్తిన 12 గంటల లోపు అట్రజిన్ 50శాతం 0.8 మి.లీ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.గడ్డి జాతి కలుపు నివారణకు 115 మి.లీ టెంబోట్రియోన్ 34.4శాతం ను 200మి.లీ నీటిలో కలిపి పంటకు పిచికారి చేయాలి.

పత్తి:

విత్తిన రెండు రోజుల వ్యవధిలో ఒక ఎకరాకు ఒక లీటరు పెండిమిథాలిన్ 30శాతం ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.క్రమం తప్పకుండా పొలంలో అంతర కృషి చేస్తుండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube