ఎల్లో మీడియా.. దత్త పుత్రుడు ! జగన్ సెటైర్లు 

చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియాతో పాటు,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ( CM jagan )తనదైన శైలిలో సెటైర్లు వేశారు.గత కొద్ది రోజులుగా ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు , టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ , జనసేన,  టిడిపి పొత్తు తదితర అంశాలపై మౌనంగానే ఉన్న జగన్ ఇప్పుడు బహిరంగ సభలోనే చంద్రబాబు అరెస్టుకు దారి తీసిన పరిస్థితులు,  పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి తదితర అంశాలపై స్పందిస్తున్నారు.

 Yellow Media.. Adopted Son Jagan Satires , Jagan, Ysrcp, Ap, Ap Cm Jagan ,-TeluguStop.com

  ఇదే విధంగా కర్నూలు జిల్లా లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జగన్ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Janasena, Telugudesam, Ysrcp-Politics

 ఈ సందర్భంగా జనసేన , టిడిపి ( JanaSena tdp )ఆ పార్టీ అనుకూల మీడియాపై జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు జీవోలు తీసుకువచ్చారని,  అదంతా కేవలం హడావిడి కోసమేనని జగన్ మండిపడ్డారు.అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమాన్ని గారికి వదిలి ఎన్నికల సమయానికి ప్రజలను మభ్యపెట్టేందుకు ఎత్తులు వేశారని జగన్ మండిపడ్డారు.

చంద్రబాబు ఎల్లో మీడియాను నమ్ముకుని రాజకీయం చేశారని , రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్న దాన్ని ఎల్లో మీడియాతో పాటు దత్తపుత్రుడుతో కలిసి పంచుకోవడం జరిగిందని జగన్ విమర్శలు చేశారు .ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏనాడు ప్రశ్నించలేదు అని  పవన్ ప్రశ్నించారు .

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Janasena, Telugudesam, Ysrcp-Politics

వైసీపీ ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా అనేది మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని ప్రజలను ఉద్దేశించి జగన్( CM jagan ) అన్నారు.గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న వాస్తవాలు గుర్తించాలని రాష్ట్ర ప్రజలను కోరారు.ప్రస్తుతం మంచి చేస్తున్న వైసిపి ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇస్తే మరింతగా మంచి చేసే అవకాశం తమకు దక్కుతుంది అంటూ ప్రజలను ఉద్దేశించి జగన్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube