ఖరీదైన కారు కొన్న తాప్సీ.. వామ్మో ధర అన్ని కోట్లా?

తాప్సీ పన్ను ( Taapsee Pannu ) గురించి తెలియని వారు లేరు.పాన్ ఇండియన్ వైడ్ గా సుపరిచితమే.

 Taapsee Pannu Has Bought Mercedes-maybach Gls, Taapsee Pannu, Manoj, Raviteja,-TeluguStop.com

ఒకప్పుడు టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ సొట్టబుగ్గల సుందరి యూత్ కు ఫేవరేట్ గా మారిపోయింది.మనోజ్ నుండి మాస్ రాజా వరకు చాలా మంది హీరోలతో ఆడిపాడింది.

దీంతో ఈమె ఇక్కడ స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది.మరి మన దగ్గర స్టార్ హీరోయిన్ అనే బ్యాడ్జ్ మెడలో వేసుకున్నాక ముద్దుగుమ్మలు ఎవరైనా ఇక్కడ ఉంటారా.

అస్సలు ఉండరు.ఈమె కూడా అలానే వెంటనే బాలీవుడ్( Bollywood ) చెక్కేసింది.

ఈ భామ లక్ బాగుండి అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది.ముఖ్యంగా బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరులా ఈ అమ్మడు నిలిచింది.

అయితే ఈమెకు ఆఫర్ ఎంతలా వచ్చాయో వాటితో పాటు వివాదాలు కూడా అదే స్థాయిలో వచ్చాయి.ఒక వైపు సినిమాల్లో బిజీ బిజీ గా ఉంటూనే ఈ భామ నిర్మాతగా కూడా మారిపోయి తన సొంత బ్యానర్ లో సినిమాలను నిర్మించడం స్టార్ట్ చేసింది.బాలీవుడ్ లో బాగా వసూళ్లు చేస్తున్న తాప్సీ అందుకు తగ్గట్టుగానే లగ్జరీ లైఫ్ ను జీవిస్తుంది.

అక్కడికి వెళ్ళాక సినిమా సినిమాకు పారితోషికం పెంచుకుంటూ పోతున్న ఈ భామ భారీగా ఆదాయం వెనకేసుకుంది.ఇక తాజాగా ఈ భామ గ్యారేజ్ లో మరో లగ్జరీ కారు చేరిపోయింది.మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 600 ( Mercedes-Maybach GLS ) ను తాప్సీ కొత్తగా తీసుకుంది.

ఈ కారు ఆదివారం ఈ భామ ఇంటికి చేరింది.దీని ధర దాదాపు 3.15 కోట్ల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాల వారు చెబుతున్నారు.బెంజ్ కార్లలోనే అత్యంత ఖరీదైన కారును సొంతం చేసుకున్న ఈమె కారు గురించే ఇప్పుడు అంత చర్చించు కుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube