Manchu Lakshmi : మంచు లక్ష్మి చిన్నప్పుడే ఇంత అందంగా ఉండేవారా… వైరల్ అవుతున్న ఓణీల ఫంక్షన్ ఫోటో!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి కుటుంబాలలో మంచు వారి ఫ్యామిలీ ఒకటి.మంచు మోహన్ బాబు( Mohan Babu ) సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత కెరియర్ మొదట్లో విలక్షణ నటుడిగా నటించేవారు.

 Manchu Lakshmi Latest News Viral On Social Media-TeluguStop.com

అనంతరం ఈయన హీరోగా నిర్మాతగా కూడా మారి ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మోహన్ బాబు తన సినీ వారసులుగా తన ముగ్గురు పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఇలా మంచు లక్ష్మి విష్ణు మనోజ్ ముగ్గురు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వాళ్ళ సినిమాలలో నటించినప్పటికీ వీరికి మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ అందలేదని చెప్పాలి.ఇక మంచు లక్ష్మి( Manchu Lakshmi ) అయితే ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇక ఈమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.ఇక ఈ మధ్యకాలంలో మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న విషయం మనకు తెలిసిందే.

తనకు తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

Telugu Manchu Lakshmi, Manoj, Mohan Babu, Tollywood-Movie

ఇక మంచు లక్ష్మికి తన తమ్ముడు మనోజ్( Manoj ) అంటే విపరీతమైన ప్రేమ.తన కుటుంబ సభ్యులు మనోజ్ రెండో పెళ్లికి ఒప్పుకోకపోయినప్పటికీ మంచు లక్ష్మి అందరిని ఒప్పించి ఈ పెళ్ళికి తానే పెద్దగా మారి మనోజ్ భూమా మౌనికల వివాహం జరిపించిన సంగతి తెలిసిందే.ఇక మనోజ్ కి తన అక్క మంచు లక్ష్మి అంటే విపరీతమైనటువంటి ప్రేమ తనని ఒక అక్కలా కాకుండా ఒక తల్లిగా భావిస్తానని మనోజ్ సైతం మంచు లక్ష్మిపై ఉన్నటువంటి ప్రేమను బయటపెట్టారు.

అయితే ఈ ప్రేమ ఇప్పుడు వచ్చినది కాదని చిన్నప్పటినుంచి కూడా లక్ష్మి అంటే మనోజ్ కు విపరీతమైనటువంటి ప్రేమ ఉండేదని తాజాగా ఒక ఫోటో చూస్తే అర్థమవుతుంది.

Telugu Manchu Lakshmi, Manoj, Mohan Babu, Tollywood-Movie

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి తన ఓణీల ఫంక్షన్ కి సంబంధించినటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు.ఈ ఫోటోలలో భాగంగా ఈమె ఎంతో అందంగా ముస్తాబయి వంటి నిండా నగలు ధరించి ఉన్నారు.ఇక ఈ ఫోటోలో తన తమ్ముడు మనోజ్ సైతం తనని ఎంతో ఆప్యాయంగా చూస్తున్నటువంటి ఈ ఫోటో వైరల్ గా మారింది.

ఈ ఫోటో చూసినటువంటి ఎంతోమంది అభిమానులు చిన్నప్పటినుంచి అక్క అంటే మనోజ్ కు ఇంత ప్రేమ ఉండేదా అంటూ కామెంట్స్ చేయగా మరికొందరు మాత్రం చిన్నప్పుడు కూడా మంచు లక్ష్మి ఇంత అందంగా ఉండేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube