తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేకమైన వినతి చేసింది.రాష్ట్రంలో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విన్నవించింది.
తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రను సీడబ్ల్యూసీ ఈ క్రమంలో గుర్తు చేసింది.సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలను మర్చిపోయారన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిజాం పరిపాలన తరహాలో పాలన కొనసాగిస్తున్నారని తెలిపింది.
గతంలో ఇందిరాగాంధీ ఇచ్చిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా లాక్కుందని ఆరోపించింది.ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రకటించే ఆరు హామీలతో కూడిన గ్యారెంటీ స్కీమ్ కార్డుతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసింది.







