సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటి హీరోలు ఒకరితో ఒకరు ఎంతో సాన్నిహిత్యంగా సోదర సోదరీ భావంతో మెలుగుతూ ఉంటారు.అంతేకాకుండా ఇలా ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఒకరి సినిమాకు మరొకరు సహాయం చేసుకోవడం మనం చూస్తుంటాము.
ఇలా ఎంతోమంది హీరోలు ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వగా మరికొందరు తమ సినిమా టైటిల్ లను( Movie Titles ) కూడా త్యాగం చేస్తూ ఉంటారు.ఇలా హీరోలు చాలామంది తమ మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తూ ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం కొట్టుకొని చస్తుంటారు.
మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గొడవ పడటమే కాకుండా చివరికి వారి కుటుంబ సభ్యులను కూడా ఈ గొడవలోకి ఇన్వాల్వ్ చేస్తూ ట్రోల్ చేస్తూ ఉంటారు.ఇకపోతే ఎంతోమంది హీరోలు ఒకరితో మరొకరికి మంచి సాన్నిహిత్యం కారణంగా సినిమాలకు సహాయపడుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే సీనియర్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నాగార్జున పవన్ కళ్యాణ్ కు ఏ హీరో చేయనటువంటి ఒక గొప్ప త్యాగం చేశారట.

మరి నాగార్జున (Nagarjuna) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు ఏ విధమైనటువంటి సహాయం చేశారు అనే విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తమ్ముడు(Thammudu Movie) సినిమా కిక్ బాక్సింగ్ నేపథ్యంలో వచ్చి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తమ్ముడు అనే టైటిల్ ఈయనది కాదని నాగార్జున సినిమాది తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ కంటే ముందుగానే నాగార్జున నిర్మాతలు ఈ సినిమా టైటిల్ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించుకున్నారట.

ఇలా రిజిస్టర్ చేయించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా తమ్ముడు అనే టైటిల్ మాత్రమే కరెక్ట్ గా సరిపోతుందని భావించారు అయితే అప్పటికే ఫిలిం ఛాంబర్ లో ( Film Chamber )రిజిస్టర్ అయి ఉండడంతో ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెట్టాలి అన్న ఆలోచనలు నిర్మాతలు ఉండిపోయారట అయితే ఏ టైటిల్ ఈ సినిమాకు సరిపోకపోవడంతో స్వయంగా నాగార్జున తాను రిజిస్టర్ చేయించుకున్నటువంటి తమ్ముడు అనే టైటిల్ ను వదులుకోవడంతో ఆ టైటిల్ పవన్ కళ్యాణ్ సినిమాకు తీసుకున్నారట.

ఈ విధంగా నాగార్జున తన సినిమా కోసం రిజిస్టర్ చేయించుకున్నటువంటి తమ్ముడు సినిమాని పవన్ కళ్యాణ్ కు త్యాగం చేశారని తెలుస్తుంది.ఇక ఈ టైటిల్ తో వచ్చినటువంటి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ఈ సినిమా విడుదలయ్యి మంచి సక్సెస్ ఆయన సమయంలో చాలామంది ఈ విషయం గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కోసం నాగార్జున ఇంత త్యాగం చేశారా నిజంగా గ్రేట్ అంటూ చర్చించుకున్నారు.
ఇక నాగార్జునతో మెగా కుటుంబానికి ఎలాంటి సాన్నిహిత్య ఉందో మనకు తెలిసిందే.ఈయన నిర్వహిస్తున్నటువంటి బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమానికి అలాగే పలు రియాలిటీ షోలకు కూడా మెగా కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరవుతూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.







