పొట్టి పొట్లకాయ( Snake Gourd Farming ) తీగ జాతి కూరగాయలలో ఒకటి.పొట్లకాయలో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, మాంగనీస్, విటమిన్లు పుష్కలంగా ఉండడం వల్ల మార్కెట్లో ఈ పొట్టి పొట్లకాయలకు మంచి డిమాండ్ ఉంది.
మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయలను పండిస్తే మంచి లాభాలు పొందవచ్చు.ఏ పంట సాగుచేసిన ముందుగా ఆ పంటపై పూర్తిగా అవగాహన కల్పించుకుంటేనే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందని వ్యవసాయ క్షేత్ర నిపుణులు( Agricultural experts ) సూచిస్తున్నారు.

ఈ పొట్టి పొట్లకాయ సాగును శాశ్వత పందిరి పద్ధతిలో సాగు చేస్తే వివిధ రకాల తెగుళ్లు( Pests ) పంటను ఆశించే అవకాశం ఉండదు.పైగా చెట్లకు సూర్యరశ్మి గాలి బాగా తగిలి మొక్క ఆరోగ్యవంతంగా పెరిగి నాణ్యమైన దిగుబడిని ఇస్తుంది.ఒక ఎకరం పొలంలో సాగు చేయడానికి 500 గ్రాముల విత్తనాలు అవసరం.విత్తడానికి ముందు విత్తనాలను విత్తన శుద్ధి చేయడం వల్ల తెగుళ్లు ఆశించకుండా ఉంటాయి.మే రెండో వారం వరకు పొట్లకాయ విత్తనాలను విత్తుకోవచ్చు.నేలలోని తేమ శాతాన్ని బట్టి మూడు రోజులకు లేదా నాలుగు రోజులకు ఒకసారి నీటి తడులు అందించడం వల్ల ఒక ఎకరం పొలంలో దాదాపుగా 15 టన్నుల పంట దిగుబడి పొందవచ్చు.

సేంద్రియ ఎరువులకు ( Organic fertilizers )అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.వేసవిలో నాలుగు సార్లు దుక్కి దున్నుకోవాలి.ఒక ఎకరం పొలంలో పది టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి.నీరు వృధా కాకుండా ఉండాలంటే డ్రిప్ విధానం ద్వారా పగటిపూట మాత్రమే నీటిని అందించాలి.
డ్రిప్ విధానం ద్వారా కలుపు సమస్య తక్కువగా ఉంటుంది.ఏవైనా తెగులు సోకిన మొక్కలు కనిపిస్తే వెంటనే పంట నుండి వేరు చేయాలి.
మొక్కల మధ్య, మొక్కల వరుసల మధ్య దూరం ఉండేటట్లు విత్తుకుంటే అంతర పంటలు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.







