సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ మర్చిపోలేనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఉంటాయి.అది పుట్టినరోజు కావచ్చు పెళ్లి రోజు కావచ్చు లేదా ఏదైనా ప్రమాదం నుంచి బయటపడినటువంటి రోజు కూడా కావచ్చు.
ఇలా ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల ప్రత్యేకమైన రోజులు ఉంటాయి.అయితే కొన్ని భయంకరమైనటువంటి ప్రమాదాల నుంచి బయటపడిన వారు మాత్రం ఆ రోజున జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు అది ఒక పీడకల అయినప్పటికీ ఆ రోజు తమకు ఒక పునర్జన్మ లాంటిదని కూడా భావిస్తూ ఉంటారు.
ఇలాంటి ఒక పీడకల లాంటి రోజు ఎన్టీఆర్ ( NTR ) జీవితంలో కూడా ఒకటి ఉందని ఆ రోజున జీవితంలో ఎన్టీఆర్ ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పాలి.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party ) తరఫున 2009వ సంవత్సరంలో ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి( Road Accident ) గురైన సంగతి మనకు తెలిసిందే.ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలు పాలై బ్రతికి బయటపడ్డారు.
ఈ విధంగా ఎన్టీఆర్ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అభిమానులు కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు.అయితే భగవంతుడి దయ అభిమానుల ప్రార్థనలతో ఎన్టీఆర్ క్షేమంగా బయటపడ్డారు.
ఈ ఘటన మార్చి 26వ తేదీ జరగడం గమనార్హం అందుకే ఎన్టీఆర్ ఈ తేదీని ఎప్పటికీ మర్చిపోరట.

ప్రతి ఏడాది జూనియర్ ఎన్టీఆర్ మార్చ్ 26వ తేదీ ఈ సంఘటనను గుర్తు చేసుకుంటారని అదేవిధంగా ఈరోజున ఆయన స్పెషల్ గా కేక్ కూడా కట్ చేసి సెలెబ్రేట్ చేసుకుంటారని తెలుస్తోంది.అయితే ఇదేరోజే ఎన్టీఆర్ కి మరొక స్పెషల్ కూడా ఉంది.తన ప్రాణానికి ప్రాణమైనటువంటి తన భార్య లక్ష్మీ ప్రణతి( Lakshmi Pranathi ) పుట్టినరోజు( Birthday ) కూడా అదే రోజు కావటం గమనార్హం.
ఇలా లక్ష్మీ ప్రణతి మార్చి 26వ తేదీ పుట్టినరోజు జరుపుకోవడంతో ఎన్టీఆర్ కూడా అదే రోజున తన పునర్జన్మగా భావించి కేక్ కట్ చేస్తారట.ఇలా ఒకే రోజే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి ఇద్దరు కూడా కేక్ కట్ చేసి ఈ స్పెషల్ డే ని సెలబ్రేట్ చేసుకుంటారని అయితే ఈ రోజు మాత్రం ఎన్టీఆర్ కి ఒక పీడకలలాంటిదే అయినప్పటికీ ఆ ఘటన నుంచి బయటపడటంతో పునర్జన్మ అని కూడా భావించి సెలబ్రేట్ చేసుకుంటారట.







