మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఇప్పటికే 150కి పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఇప్పటికీ కొనసాగుతున్నారు.ఇక ఆ మధ్యకాలంలో రాజకీయాలపైకి మనసు మళ్ళి పాలిటిక్స్ లోకి వెళ్ళినప్పటికీ అంతగా సక్సెస్ అవ్వకపోవడంతో మళ్లీ సినిమా బాట పట్టారు.
అంతే కాదు సెన్సిటివ్ అయిన చిరంజీవి రాజకీయాలను తట్టుకోలేక పోయారు.ఈ కారణంతో రాజకీయాలను వదిలేశారు.
తనకి పాలిటిక్స్ కలిసి రావని సినిమాలే తనకు కలిసి వస్తాయని మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.అయితే అలాంటి చిరంజీవి ఒకానొక సమయంలో కమలహాసన్ ( Kamal haasan ) నటించిన ఒక సినిమా చూసి దాదాపు మూడు రోజుల వరకు నిద్ర పోలేదట.
మరి కమలహాసన్ ని చూసి ఎందుకు చిరంజీవి నిద్రపోలేదు అనే సంగతి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
లెజెండరీ డైరెక్టర్ కళాతాపస్వి విశ్వనాథ్( K.Vishwanath ) గారు దర్శకత్వం వహించిన స్వాతిముత్యం సినిమా అందరూ చూసే ఉంటారు.ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అంతే కాదు ఈ సినిమాలో కమలహాసన్ యాక్టింగ్ చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు.అయితే అలాంటి ఈ అద్భుతమైన సినిమా చూశాక చిరంజీవికి దాదాపు మూడు రోజుల వరకు నిద్ర పట్టలేదట.

ఎందుకంటే 1980 టైంలో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవి కి 1985 లో రిలీజ్ అయిన స్వాతిముత్యం ( Swathi Muthyam) సినిమా చూశాక ఆ సినిమాలోని క్యారెక్టర్ నాకెందుకు రాలేదబ్బా అని చాలా బాధపడ్డారట.ఇక ఇదే విషయాన్ని ఓసారి విశ్వనాధ్ గారు కనిపించినప్పుడు ఎందుకండీ ఇలాంటి సినిమా నాతో చేయలేదు.నేను ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు మీకు గుర్తుకు రాలేదా అని అడిగారట.అంతేకాదు ఈ సినిమా చాలా బాగుంది అని కూడా తన అద్భుతమైన ఫీలింగ్ ని విశ్వనాథ్ గారితో పంచుకున్నారట.

ఇక ఇదే విషయాన్ని ఓసారి కమలహాసన్ ( Kaml haasan ) కనిపించినప్పుడు కమల్ నీ మీద నాకు చాలా జలస్ గా ఉంది.ఎందుకంటే స్వాతిముత్యం లాంటి అద్భుతమైన సినిమాలో అవకాశం నువ్వు కొట్టేసావు నాకెందుకు అలాంటి ఛాన్స్ రాలేదు అని నేను జలస్ గా ఫీల్ అవుతున్నాను అని చెప్పారట.కానీ అలా ఎందుకు అనుకుంటున్నారు అని కమలహాసన్ అడిగితే.నేను ఎన్ని సినిమాల్లో నటించి కమర్షియల్ హిట్స్ కొట్టినప్పటికీ నాలో ఉన్న నటుడికి ఇలాంటి మూవీస్ లో ఉన్న పాత్రల్లో నటిస్తేనే సాటిస్ఫై అవుతుంది అంటూ చిరంజీవి ( Chiranjeevi ) తనలో ఉన్న ఆ బాధని కమల్ హాసన్ తో కూడా పంచుకున్నారట.
ఇలా కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం సినిమా చూసి తనకు ఆ పాత్ర రానందుకు చిరంజీవి మూడు రోజుల వరకు సరిగ్గా నిద్ర కూడా పోలేదట.







