జాతి రత్నాలు( Jathi Ratnalu ) సినిమా తో కమర్షియల్ సక్సెస్ సొంతం చేసుకున్న నవీన్ పోలిశెట్టి ఆ వెంటనే పలు సినిమాల్లో నటించే అవకాశాలను సొంతం చేసుకున్నాడు.కానీ యు వి క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క తో కలిసి కమిట్ అయిన సినిమా కారణంగా నవీన్ పోలిశెట్టి ( Naveen Polishetty )రెండు మూడు సినిమాలను వదిలేసుకున్నట్లుగా సమాచారం అందుతుంది.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా దాదాపు రెండు సంవత్సరాల పాటు ఊరించి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఎట్టకేలకు విడుదలైన ఈ సినిమా కి మిశ్రమ స్పందన వచ్చింది.
జాతి రత్నాలు వంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమా ను ప్రేక్షకులకు అందించిన నవీన్ పోలిశెట్టి ఇలాంటి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఏంటి అంటూ చాలా మంది పెదవి విరుస్తున్నారు.

ఆ విషయం పక్కన పెడితే భారీ అంచనాల నడుమ యు వి క్రియేషన్స్ వారు ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది.అనుష్క( Anushka Shetty ) లుక్ పరంగా విమర్శలు రాకూడదనే ఉద్దేశం తో గ్రాఫిక్స్ వర్క్ చేశారు అనే టాక్ ఉంది.అందుకే ఆమె సన్నివేశాల్లో కొన్ని సన్నివేశాలు ఆర్టిఫిషియల్ గా అనిపించాయి అంటూ రివ్యూ లు వచ్చాయి.

ఈ సినిమా కోసం నవీన్ పోలిశెట్టి ఏడాది సమయం అదనంగా కేటాయించినట్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జాతి రత్నాలు సినిమా తర్వాత వెంటనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఈ సినిమా ను కూడా చేసి ఉంటే బాగుండేదని నవీన్ పోలిశెట్టిని అభిమానించే వాళ్ళు కొందరు ఈ సమయం లో మాట్లాడుకుంటున్నారు.ఇకనైనా నవీన్ పోలిశెట్టి గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమా లతో రావాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.







