Avasarala Srinivas: అవసరాల శ్రీనివాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి అవసరానికి పనికి రాకుండా పోయాడా ?

అవసరాల శ్రీనివాస్…( Avasarala Srinivas ) అష్టా చమ్మా సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు ఒక కమీడియన్ గా పరిచయమయ్యాడు బేసిగ్గా అతడు వృత్తి రీత్యా రైటర్ మరియు దర్శకుడు అయినప్పటికీ కూడా అవకాశం వచ్చింది కదా అని నటుడుగా కూడా ప్రయత్నించాడు కానీ సినిమాల్లో దర్శకత్వం వహించే సినిమాల కన్నా కూడా నటుడి గానే అతనికి అవకాశాలు ఎక్కువగా వచ్చాయి పైగా అతని డైలాగ్ డెలివరీ గాని, కామెడీ టైమింగ్ గాని అద్భుతంగా ఉంటుంది.అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కమెడియన్( Comedian ) దొరికాడు అని అందరూ భావించారు.

 Avasarala Srinivas Not Interested In Acting-TeluguStop.com

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి కమెడియన్స్ కొరత ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే ఎందుకంటే కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ఆ కమిడియన్స్ వేసే పంచుల్లో పస లేకుండా పోతుంది.

Telugu Brahmanandam, Phalanaabbayi, Tollywood-Movie

దాంతో కొత్త కొత్త నటులకు అవకాశాలు దొరుకుతున్నాయి కానీ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రం సరైన స్టాండర్డ్ కమెడియన్ లేరు ఒకప్పుడు బ్రహ్మానందం( Brahmanandam ) లాంటి మాయాజాలం చేసే నటులు మళ్లీ రావడం లేదు.అయితే మంచి కామెడీ టైమింగ్ ఉన్నటువంటి అవసరాల శ్రీనివాస్ ఓ పైపు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు.కానీ సినిమాల్లో నటించడం అనే విషయాన్ని అంతగా సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే అవసరాల శ్రీనివాస్ అవసరానికి పనికి రాకుండా పోతున్నాడు.

పైగా ఈ మధ్యకాలంలో అతడు దర్శకత్వం వహించిన పలానా అబ్బాయి పలానా అమ్మాయి సినిమా( Phalana Abbayi Phalana Ammayi Movie ) దారుణంగా పరాజయం చవి చూసింది.

Telugu Brahmanandam, Phalanaabbayi, Tollywood-Movie

రైటర్ గా కూడా పెద్దగా బిజీగా లేని అవసరాల శ్రీనివాస్ మళ్ళీ కామెడీ పై దృష్టి పెట్టి సినిమాల్లో నటిస్తే బాగుండు అని ఒక వర్గం అభిమానులు కోరుకుంటున్నారు.ఇక హైదరాబాదులో పుట్టి పెరిగిన అవసరాల శ్రీనివాస్ విజయవాడలో బీటెక్ చదివి అమెరికాలో ఉద్యోగం చేసి కొన్నాళ్ల పాటు అక్కడే ఉండి ఆ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి సినిమా ఇండస్ట్రీలో( Cinema Industry ) అవకాశాల కోసం ప్రయత్నించి ప్రస్తుతం రైటర్ గా, డైరెక్టర్ గా, యాక్టర్ గా సెటిల్ అయ్యాడు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube