ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబుని( Chandrababu Naidu ) స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ పోలీసుల అరెస్టు చేయడం తెలిసిందే.శనివారం ఉదయం నంద్యాలలో అరెస్టు చేసి.
చంద్రబాబు కాన్వాయ్ లోనే ఆయనను రోడ్డు మార్గం గుండా విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించి సాయంత్రం విచారణ స్టార్ట్ చేయడం జరిగింది.ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) పట్ల రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఇదే విషయంపై తెలంగాణ సీనియర్ రాజకీయ నేత తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు.చంద్రబాబు అరెస్ట్ అప్రజస్వామికమని.
రాజకీయ కక్షతోనే ఆయనను అరెస్టు చేశారని అన్నారు.

అరెస్టు చేసిన సమయంలో అధికారులు కనీసం న్యాయ సూత్రాలు పాటించకుండా దుర్మార్గంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పట్ల అధికారులు అమర్యాదగా ప్రవర్తించడం దారుణం అని అన్నారు.అసత్యాలతో చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నట్లు తుమ్మల ఆరోపించారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు క్యాబినెట్ లో తుమ్మల నాగేశ్వరరావు( Thummala Nageswara Rao ) మంత్రిగా పనిచేశారు.రాష్ట్ర విభజన అనంతరం నెలకొన్న రాజకీయ పరిస్థితులు కారణంగా తెలుగుదేశం పార్టీకి( TDP ) గుడ్ బై చెప్పడం జరిగింది.
ఈ క్రమంలో రాజకీయ కక్షతోనే చంద్రబాబుని అరెస్టు చేసినట్లు తుమ్మల వ్యాఖ్యానించారు.







