చాలా కాలం నుండి బాక్స్ ఆఫీస్ వద్ద సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్,( Rajinikanth ) కే రీసెంట్ గా జైలర్ సినిమాతో( Jailer Movie ) భారీ కం బ్యాక్ ఇచ్చి సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ సినిమా వసూళ్ల సునామి హ్యాంగ్ ఓవర్ నుండి ఇంకా ఎవ్వరూ పూర్తిగా తేరుకోలేదు.
కానీ అప్పుడే అమెజాన్ ప్రైమ్ లోకి అందుబాటులో వచ్చేసింది.ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో టాప్ స్థానం లో కొనసాగుతుంది.
తెలుగు , తమిళం భాషల్లో ఈ చిత్రానికి థియేట్రికల్ ఆడియన్స్ దాదాపుగా అయిపోయినట్టే.కలెక్షన్స్ కూడా బాగా తగ్గిపోయాయి.
ఇక అన్నీ ప్రాంతాలలో క్లోసింగ్ కలెక్షన్స్ వేసేస్తున్నారు.ట్రేడ్ పండితులు అందించిన లెక్కల ప్రకారం ఈ సినిమా క్లోసింగ్ లో ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
ముఖ్యంగా తెలుగు వెర్షన్ వసూళ్లు ఎంత వచ్చాయో ఒకసారి చూద్దాం.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు( Dil Raju ) కేవలం 13 కోట్ల రూపాయలకు తెలుగు డబ్బింగ్ రైట్స్ ని( Jailer Telugu Rights ) కొనుగోలు చేసాడు.మొదటి మూడు రోజుల్లోనే ఆయన పెట్టిన డబ్బులు రీ కవర్ అయిపోయాయి.ఆ తర్వాత నాల్గవ రోజు నుండి ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు మొత్తం లాభాలే.
రీసెంట్ గా విడుదలైన తెలుగు స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలకు కూడా ఈ రేంజ్ వసూలు లేవు.వర్కింగ్ డేస్ లో కూడా అన్నీ ప్రాంతాలలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో థియేటర్లు కళకళలాడి పోయాయి.
ఫలితంగా ఈ చిత్రానికి కేవలం తెలుగు వెర్షన్ నుండే 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.రోబో సిరీస్ తర్వాత రజినీకాంత్ కి ఆ రేంజ్ వసూళ్లు రావడం ఈ సినిమాకే జరిగింది.
అలా తెలుగు వెర్షన్ లో దుమ్ము లేపిన ఈ సినిమాకి తమిళం వెర్షన్ లో ఏ రేంజ్ వసూళ్లు వచ్చి ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.కేవలం తమిళ నాడు ప్రాంతం నుండి 190 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి, ఓవర్సీస్ లో అక్షరాలా 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.ఇది మామూలు రేంజ్ వసూళ్లు కాదనే చెప్పాలి.ఆ తర్వాత కర్ణాటక లో 70 కోట్లు,( Karnataka ) కేరళ లో 55 కోట్ల రూపాయిల వసూళ్లు( Kerala ) వచ్చాయి.
అలా మొత్తం మీద ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 630 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.హిందీ లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసి ఉంటే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.