వరంగల్ కేయూ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు.విద్యార్థులపై కేసులు పెట్టడం దారుణమన్న ఆయన విద్యార్థులను రౌడీలుగా, క్రిమినల్స్ గా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.
ఈ మేరకు వరంగల్ సీపీ రంగనాథ్ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంది స్టూడెంట్స్ కాదని, సీపీ అని అన్నారు.
అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించొద్దని సూచించారు.సీపీ రంగనాథ్ చట్టాలకు లోబడి పని చేయాలన్న రఘునందన్ రావు మీరు కొమ్ముకాసే ప్రభుత్వం ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే పోలీసులు, సీపీపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీ, కోర్టులను ఆశ్రయిస్తామని తెలిపారు.







