టైర్లకు పంక్చర్లు వేసేటప్పుడు జాగ్రత్త.. లేకపోతే ఇక అంతే సంగతులు

టైర్లకు పంచర్ ( tires puncher )అయినప్పుడు మధ్యలో వాహనాలను నిలిపివేయాల్సి ఉంటుంది.ఇలాంటి సమయంలో మనకు వస్తే స్వయంగా పంచర్ వేసుకుంటాం.

 Be Careful While Giving Punctures To The Tires Otherwise That's All, Tyres Punc-TeluguStop.com

చేతకాకపోతే సమీపంలోని మెకానిక్ షాపు దగ్గరకు తీసుకెళ్తాం.అయితే పంచర్ వేసేటప్పుడు ఒక్కొక్కసారి ప్రమాదాలు కూడా చోటుచేసుకోవచ్చు.

టైర్లు పేలడం లేదా గాల్లోకి ఎగరడం లాంటివి జరుగుతూ ఉంటాయి.తాజాగా అలాంటి ఘటన ఒకటి జరగ్గా.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒక పంక్చర్ షాపు దగ్గర లారీ టైర్ కు మెకానిక్ పంక్చర్ వేస్తున్నాడు.కానీ ఏమైందో ఏమో కానీ టైర్‌కు పంక్చర్ వేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది.లారీ ట్యూబ్ లో పీడనం ఎక్కువై ఒక్కసారిగా టైర్ పేలిపోయింది.

దీని దెబ్బకు అక్కడే ఉన్న ముగ్గరు వ్యక్తులు గాల్లోకి ఎంగిరి కింద పడ్డారు.కానీ చిన్న ప్రమాదమే కావడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగ్గలేదు.

స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.మెకానిక్ షాపు( Mechanic shop ) దగ్గర అమర్చని సీసీ కెమెరాల్లో ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

ఈ ఫుటేజీని బోగర్ జెమ్ బీరా ( Boger Gem Beer )అనే యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

ఈ వీడియోను ఇప్పటివరకు 7 కోట్ల మంది వీక్షించారు.అలాగే దీనికి 34 లక్షల లైక్స్ వచ్చాయి.ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

టైర్లకు పంక్చర్లు వేసేటప్పుడు ఇలా కూడా జరుగుతుందా అంటూ కొంతమంది పోస్ట్ చేస్తున్నారు.అది టైర్ కాదని, ల్యాండ్ మైన్ అని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

ట్యూబులో గాలి ఎక్కువైందని, అందుకే పేలిపోయింది ఇలా జరిగిందని ఇంకోంతమంది నెటిజన్లు పేర్కొంటున్నారు.పెద్ద ప్రమాదమే తప్పిందని, పంక్చర్ల షాపు దగ్గరికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందేనని దీని ద్వారా తెలుస్తుందని కొంతమంది సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube