టాలీవుడ్ లో ఎన్నో క్రేజీ కాంబినేషన్ లు ఉన్నాయి.వాటిలో నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ కూడా ఒకటి.
అయితే వీరిద్దరి కలయికలో ఇప్పటివరకు సింహా,( Simha ) లెజెండ్,అఖండ వంటి సినిమాలు విడుదల బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డుల మోత మోగించిన విష తెలిసిందే.అంతేకాకుండా ఇవి ఒకదానిని మించి ఒకటి విజయం సాధించాయి.
ఇది ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ మరోసారి అనగా నాలుగోసారి రిపీట్ కానుందని తెలుస్తోంది.

వీరి కలయికలో రానున్న నాలుగో ప్రాజెక్ట్ అఖండ-2( Akhanda 2 ) కావడం విశేషం.ఇప్పటికే పార్ట్ వన్ విడుదల అయ్యి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.అయితే అఖండ పార్ట్ 2 ఉంటుందా లేదా అన్న సందేహాలు నెలకొంటున్న సమయంలో తాజాగా జరిగిన స్కంద మూవీ ఈవెంట్ లో మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చారు బోయపాటి.అఖండ-2 ఖచ్చితంగా ఉంటుందని, కాకపోతే కాస్త సమయం పడుతుందని అన్నారు.ఈ క్రమంలోనే అఖండ-2 ఖచ్చితంగా ఉంటుందని చెప్పడంతో బాలయ్య బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి లెక్క వంద కోట్ల నుంచి మొదలవుతుందని అంటున్నారు.

కాగా గత ఏడాది విడుదల అయిన విడుదలైన వరల్డ్ వైడ్ గా రూ.75 కోట్లకు పైగా షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.అలాంటిది అఖండ-2 ఏస్థాయి సంచలనాలు సృష్టిస్తుందనేది అప్పుడే లెక్కలు మొదలయ్యాయి.
అసలే బాలయ్య-బోయపాటి( Boyapati srinu ) కాంబోకి ఉన్న క్రేజ్, దానికితోడు అఖండ సీక్వెల్, పైగా ఇప్పుడు పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి.ఈ లెక్కన అఖండ-2 మినిమం రూ.100 కోట్ల షేర్ రాబట్టడం గ్యారెంటీ అని అంటున్నారు అభిమానులు.







