తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నటి శ్రీ రెడ్డి( Sri Reddy ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.శ్రీ రెడ్డి వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
తరచూ ఏదో ఒక వివాదంతో ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఎక్కువగా కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా కామెంట్స్ చేస్తూ ఉంటుంది.
ఎదుటి వ్యక్తిని టార్గెట్ చేస్తూ వారిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది.శ్రీ రెడ్డి ఎక్కువగా మెగా ఫ్యామిలీని( Mega Family ) టార్గెట్ చేస్తూ ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.

మెగా ఫ్యామిలీలో ఎవరో ఒకరిని తరచుగా టార్గెట్ చేస్తూ వారిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ బూతులతో రెచ్చిపోతూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని( Allu Arjun ) ఉద్దేశించి కొన్ని వాఖ్యలు చేసింది శ్రీరెడ్డి.తాజాగా అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా( Best Actor Award ) ఎంపిక అయిన సందర్భంగా అల్లు అర్జున్ కి విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో ఈ విధంగా ట్వీట్ చేసింది.కంగ్రాచ్యులేషన్స్ అల్లు అర్జున్ ఆన్ విన్నింగ్ బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్స్.
అల్లు అర్జున్ లో నాకు నచ్చిన విషయం ఏమిటంటే, మెగా అనే ముసుగులో లేకుండా, తన పని తాను చేసుకుంటున్నాడు.

అంటూ మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేయగా ప్రస్తుతం అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కాగా శ్రీ రెడ్డి చేసిన ట్వీట్ పై మెగా అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.ఇకపోతే మొన్నటి వరకు యూట్యూబ్ ఛానల్ లో వంట వీడియోలు చేస్తూ సోషల్ మీడియాకు దూరంగా ఉన్న శ్రీ రెడ్డి ఈ మధ్యకాలంలో మరోసారి రెచ్చిపోయి సంచలన వాఖ్యలు చేస్తూ ఏదో ఒక కాంట్రవర్సీ కొని తెచ్చుకుంటూనే ఉంది.







