అంతరిక్షంలోకి ఇస్రో వ్యోమమిత్ర.. మిషన్ సక్సెస్ అయితే నాల్గవ దేశంగా భారత్..!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో( ISRO ) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయిన విషయం అందరికీ తెలిసిందే.ఇక తరువాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టబోయే మిషన్ పేరు గగన్ యాన్( Gagan Yan ).

 Isro Vyomamitra Into Space If The Mission Is Successful, India Will Become The F-TeluguStop.com

ఈ మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి మహిళా రోబో వ్యోమమిత్రను ఇస్రో పంపించనుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

ఈ గగన్ యాన్ మొదటి ట్రయల్ రన్ అక్టోబర్ లో మొదటి లేదా రెండవ వారంలో జరుగనుంది.ట్రయల్ రన్ సక్సెస్ అయ్యాక.మహిళా రోబో వ్యోమమిత్ర ను అంతరిక్షంలోకి పంపిస్తారు.

ఈ రోబోను ఇస్రో శాస్త్రవేత్తలు( ISRO scientists ) అద్భుత టెక్నాలజీతో తయారు చేశారు.ఈ రోబో అచ్చం మనిషిలాగే మాట్లాడడం, స్పందించడం, హావభావాలు పలికిస్తుంది.

గగన్ యాన్ లో భాగంగా అంతరిక్షంలోకి పంపిన తర్వాత ఈ రోబో ఇస్రో శాస్త్రవేత్తలతో మాట్లాడుతుంది.శాస్త్రవేత్తలు చెప్పిన పనులను రోదసిలో పూర్తిచేసి తిరిగి భూమికి వస్తుంది.

ఈ వ్యోమమిత్ర ప్రయోగం సక్సెస్ అయితే.2024 లేదా 2025లో నిజమైన వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపిస్తారు.ఇది సక్సెస్ అయితే అమెరికా, రష్యా, చైనా తరువాత అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని తీసుకెళ్లిన నాలుగవ దేశంగా భారత్ నిలుస్తుంది.ఈ ప్రయోగం కోసం ఇస్రో చాలా ఏళ్లుగా ఫోకస్ పెట్టి అడుగులు ముందుకు వేస్తోంది.

ఇస్రో సెప్టెంబర్ 2న సూర్యయాన్ మిషన్( Suryaan Mission ) చేపడుతోంది.ఈ మిషన్ లో భాగంగా ఆదిత్య L1 మిషన్ ను సూర్యుడు వైపు పంపిస్తోంది.

ఈ మిషన్ లో భాగంగా సూర్యుడి ఉపరితలన్ని పరిశీలించి ఎక్కడ మంటలు ఉన్నాయి.అక్కడక్కడా మంటలు లేకుండా ఉన్న స్పాట్లేంటి, ఆ మంటలు లేని ప్రాంతంలో మనుషులు జీవించే అవకాశం ఉందా వంటి అంశాలను పరిశీలించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube