నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు.. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది

రాజన్న సిరిసిల్ల జిల్లా: నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు.వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైందని వరాలిచ్చే తల్లి వరలక్ష్మికి అంకితమివ్వబడిన శుక్రవారం నాడే ఈ మాసం ప్రారంభం కావడం శుభ పరిణామమని ఎల్లారెడ్డిపేట శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధు గుండయ్య శర్మ అన్నారు.

 Varalakshmi Vratam At Sri Shirdi Saibaba Temple Ellareddy Peta, Varalakshmi Vrat-TeluguStop.com

ఎల్లారెడ్డిపేట మండలం లోని వివిధ ఆలయాలలో శుక్రవారం శ్రీ వరలక్ష్మి ప్రత్యేక పూజలు కన్నుల పండువగా జరిగాయి.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధు గుండయ్య శర్మ ఆధ్వర్యంలో 40 మంది మహిళలు వరలక్ష్మీ మాతాకు కుంకుమ పూజ చేశారు.

ఈ సందర్భంగా మహిళలు తమతమ ఇండ్లల్లో శ్రీ వరలక్ష్మి మాతా విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రంగురంగుల పూలతో ఆలంకరించి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా మహిళలు వయనం నీకిస్తినమ్మ వయనం నేను తీసుకుంటినమ్మ అంటూ ఒకరికొకరు వయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు.

కాళ్ళకు పారాయిణి చెంపలకు పసుపు కుంకుమలు పెట్టుకుని స్వీట్లు తీపి వంటలు పంచారు.

శ్రీ వరలక్ష్మీ మాతాకీ జై , శ్రీ వరలక్ష్మీ మాతాకీ జై అంటూ మంగళహారతి పాటలతో ఆలయాలు మారుమోగాయి.

మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ మధుగుండయ్య శర్మ మాట్లాడుతూ తెలుగు క్యాలెండర్ ప్రకారం నేటి నుంచే మన శ్రావణ మాసం ప్రారంభమైందన్నారు.

వరాలిచ్చే వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠలు నియమాలు అవసరం లేదు.నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు.లక్ష్మీదేవి కృపా కటాక్షలు కలిగి ఐశ్వర్యం లభిస్తుందన్నారు.సకల శుభాలుకలుగుతాయి.

స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి.లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి.

సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు.ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపదలెన్నో ఎన్నో ఉన్నాయి.

‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉందన్నారు.

శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం స్త్రీలకు అత్యంత విశిష్టమైన రోజు.

ఈ రోజు ఆచరించే వరలక్ష్మీ వ్రతం స్త్రీలకు ఐదవతనాన్ని, అప్లైయిశ్వర్యాలను కలగజేస్తుందని నమ్ముతారని ముత్తయిదువులు శుక్రవారం తెల్లవారుజామునే లేచి శుచిగా స్నానం చేసి పూజామందిరాన్ని అలంకరించుకొని కలశం పెట్టి ఈ వ్రతం ఆచరిస్తారని శ్రావణమాసంలో ఈవ్రతం ఆచరించడంవలన తమ కోరికలు నెరవేరతాయని స్త్రీలు నమ్ముతారు.ఇంతటి పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవారం వ్రత విధానం, కధా, పూజా విధానం గురించి ఆయన భక్తులకు వివరించారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ దుర్గా మాత ఆలయం వద్ద ఆలయ సేవకురాలు దుంపెన స్రవంతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube