ఉపాధి హామీ పథకాల్లో ఇక ఆధార్ ఆధారిత చెల్లింపులు తప్పనిసరి!

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం( Employment Guarantee Scheme ) గురించి అందరికీ తెలిసినదే.ఇక ఈ పధకం కింద కార్మికులకు చెల్లించే డబ్బులు ఆధార్ ఆధారిత చెల్లింపు విధానంలో అమలు చేయడానికి గడువుని ఆగస్టు 31 వరుకు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత పొడిగించబడదని ప్రభుత్వ వర్గాలు తాజాగా ఓ ప్రకటనలో తెలిపాయి.

 Aadhaar Based Payments Are Now Mandatory In Employment Guarantee Schemes, Aadhaa-TeluguStop.com

ఇకపోతే మహాత్మా గాంధీ( Mahatma Gandhi ) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నమోదైన వారికి వేతనాలు చెల్లించేందుకు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏబీపీఎస్)ని ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసినదే.ఈ క్రమంలో ఏబీపీఎస్‌ మోడ్‌ను తప్పనిసరిగా స్వీకరించడానికి ప్రారంభ గడువు ఫిబ్రవరి 1, తరువాత మార్చి 31 వరకు, తరువాత జూన్ 30 వరకు, చివరికి ఆగస్టు 31 వరకు పొడిగించబడింది.

Telugu Aadhaar, Mandatory-Latest News - Telugu

జాబ్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానించడం వల్ల ఉపాధి హామీ పథకంలో పారదర్శకత పెరగడంతో పాటు డూప్లికేషన్, జాబ్ కార్డ్‌ల( Duplication of job cards ) దుర్వినియోగాన్ని నిరోధించవచ్చని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఓ నిర్ణయానికి వచ్చింది.ఈ నేపథ్యంలోనే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఆధార్‌ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.అయితే పలు రాష్ట్రాల అభ్యర్థనలను దృష్టిలోఉంచుకుని ఆగస్టు 31,2023 వరకు చెల్లింపులను ఆధార్‌ ఆధారిత చెల్లింపు వ్యవస్థ లేదా నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ హౌస్‌ మోడ్‌( National Automated Clearing House Mode ) ద్వారా నిర్వహించేందుకు మంత్రిత్వ శాఖ అనుమతించింది.

Telugu Aadhaar, Mandatory-Latest News - Telugu

ఇకపోతే, ఈపాటికే ఉపాధి హామీ కార్మికుల ఖాతాల్లో 90 శాతానికి పైగా ఆధార్‌తో అనుసంధానించబడినందున గడువును ఇకపై పొడిగించబోమని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు బల్లగుద్ది మరీ చెప్పారు.జూన్‌లో మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం చూసుకుంటే, మొత్తం 14.28 కోట్ల క్రియాశీల లబ్ధిదారులలో, 13.75 కోట్ల మంది ఆధార్ నంబర్ సీడింగ్ చేయబడింది.అందులో 77.81 శాతం మంది ఆ సమయంలో ఏబీపీఎస్‌కు అర్హులుగా తేలడం కొసమెరుపు.మే 2023లో దాదాపు 88 శాతం వేతన చెల్లింపు ఏబీపీఎస్ ద్వారా జరిగింది.

ఉపాధి హామీ లబ్ధిదారులకు జారీ చేసిన జాబ్ కార్డ్‌ల డేటాను కార్మికుడు ఏబీపీఎస్‌కి అర్హులు కాదనే కారణంతో తొలగించలేమని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube