ఇటీవల, అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ అందరినీ నివ్వెర పరుస్తున్నాయి.దిగ్గజ దర్శకుడు రాజమౌళి( Rajamouli ) కంటే అనిల్ రావిపూడి 1000 రెట్లు మంచి దర్శకుడు అని, అతను ఎక్కువ ధైర్యం కలిగిన వ్యక్తి అని వారు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు.
సినిమా పరిశ్రమలో రాజమౌళి నంబర్ వన్ దర్శకుడు అని అందరూ అంగీకరిస్తున్నారు కానీ ఒక విషయంలో మాత్రం అనిల్ ను బాగా పొగుడుతున్నారు.రాజమౌళి అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటాడు.
అయితే, అనిల్ రావిపూడి కూడా ఒక టాలెంటెడ్ దర్శకుడు. అతను తన సినిమాలతో ప్రేక్షకులను ఎప్పుడూ నవ్విస్తాడు.
అలాగే సమాజంలో ప్రజల మనస్తత్వం ఎలా ఉందనేది ఫన్నీగా చూపించగలడు.

రాజమౌళి తన కెరీర్లో ఒక్క ఫ్లాప్ సినిమా కూడా చేయలేదు.నిజానికి అతడు తీసిన మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా తీసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి.అయితే, ఈ దర్శక ధీరుడు ఇప్పటివరకు నందమూరి బాలకృష్ణతో(Nandamuri Balakrishna ) ఒక్క సినిమాను కూడా డైరెక్ట్ చేయలేకపోయాడు.
బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడితో భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari Movie ) చేస్తున్నారు.ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది.త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, రామ్ గోపాల్ వర్మ, శేఖర్ కమ్ముల వంటి దర్శకులు ఎవరూ కూడా బాలకృష్ణతో సినిమా చేయడానికి ధైర్యం చేయలేదు.రాజమౌళి కూడా ఈ నందమూరి అందగాడి అద్భుతమైన టాలెంట్ ఉపయోగించుకోలేకపోయాడు.
దీనికి కారణం గట్స్ లేకపోవడమేనని అనిల్ రావిపూడి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

కొన్నిసార్లు అవకాశాలు వచ్చినా చేజారిపోతాయి.కానీ అనిల్ రావిపూడి మాత్రం తన కోసం ఒక అవకాశాన్ని సృష్టించుకున్నాడు.అతను బాలకృష్ణను కలసి, తన వద్ద ఉన్న కథను అతనితో ఓపెన్ గా చెప్పాడు.
తన కథతో బాలకృష్ణను మెప్పించాడు.తనతో కలిసి సినిమా చేయడానికి అతన్ని ఒప్పించాడు.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.త్వరలోనే విడుదల కానుంది.అనిల్ రావిపూడి ఫ్యాన్స్ రాజమౌళి కన్నా అనిల్ రావిపూడి వెయ్యి రెట్లు బెటర్ అని నమ్ముతున్నారు.అనిల్ రావిపూడి ధైర్యవంతుడని, అతను సొంతంగా అవకాశాన్ని సృష్టించుకోగలడని అంటున్నారు.
అనిల్ కథలను బాగా చెప్పగలడని అందుకే బాలకృష్ణని కూడా ఆకట్టుకోగలిగాడని అంటున్నారు.అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబో మూవీ ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో, అలాగే ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి.







