గన్నవరం వైసీపీలో చాలా కాలంగానే గ్రూపు రాజకీయాలు చోటుచేసుకున్నాయి.ముఖ్యంగా టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసిపికి అనుబంధంగా కొనసాగుతున్న వల్లభనేని వంశీ రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న యార్లగడ్డ వెంకట్రావు( Yarlagadda Venkatrao ) చివరకు వైసీపీకి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు.2019 ఎన్నికల్లో గన్నవరం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి వంశీ పై( Vallabhaneni Vamsi ) ఓటమి చెందిన వెంకట్రావు 2024 లోను వైసీపీ నుంచి పోటీ చేయాలని భావించారు.అయితే వల్లభనేని వంశీ వైపే జగన్ మొగ్గు చూపిస్తూ ఉండడం, ఆయనే అభ్యర్థిగా ఉంటారని క్లారిటీ ఇవ్వడంతో, చాలా కాలంగా వెంకట్రావ్ తీవ్ర అసంతృప్తితోనే ఉంటున్నారు.
ఆయనను బుజ్జగించేందుకు డిసిసిబి చైర్మన్ పదవిని కట్టబెట్టారు.ఆయినా వెంకటరావు మాత్రం ఏదో ఒక అంశంపై స్పందిస్తూనే వైసిపి అధిష్టానానికి ఇబ్బందికరంగా మారారు.
ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ సలహాదారు, వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) స్పందించారు.వెళ్లేవారు వెళ్లొచ్చు .ఉండేవారు ఉంటారు అంటూ ఆయన పరోక్షంగా వెంకటరావు వ్యవహారం పై స్పందించారు.ఇది ఇలా ఉంటే పార్టీలో చోటుచేసుకుంటున్న వ్యవహారాలపై యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు.” నేను టికెట్ ( YCP Ticket ) కావాలని అడిగితే పార్టీ పెద్దలకు ఏం అర్థమైందో నాకు తెలియడం లేదు.వయసు ఉండి ఉంటే నాకు ఇలా జరిగేది కాదు అని అందరూ అంటున్నారు.
వైఎస్ ఉంటే పార్టీ ఎలా ఉంటుందో అలానే ఉంటాది అనుకున్న, వైసీపీ ప్రభుత్వం వచ్చినా నాపై కేసులు మాత్రం అలాగే ఉన్నాయి.

ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యలు బాధకు గురిచేసాయి.కేడీసీసీ బ్యాంకును అభివృద్ధి చేసినా పనికిరానని పక్కన పెట్టారు.టిడిపి కంచుకోట గన్నవరంలో( Gannavaram ) వైసిపి గెలుపు కోసం కృషి చేశాను.
గన్నవరం అభ్యర్థిగా నేను సరిపోను అని అన్నారు.పార్టీ కోసం ఎంత సేవ చేస్తే నాకు ఈ దుస్థితి వస్తుందని అనుకోలేదు .2019లో సరిపోయిన నా బలం ఇప్పుడు ఎందుకు సరిపోదు.మూడేళ్లుగా నాకు ప్రత్యామ్నాయం దొరకలేదా ? తడిగుడ్డతో గొంతు కోయడం నాకు జరిగింది .టిడిపి నుంచి గెలిచి వచ్చిన వారు రావడమేనా పార్టీ బలం ? రాజకీయం నైతికత అనేది వైఎస్ కి ఉంది.కొందరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని కోరుతున్నారు.

ఇప్పటివరకు చంద్రబాబు, లోకేష్ వంటి టిడిపి నేతలు మూడున్నరేళ్లుగా కలవలేదు.నేను టిడిపి నేతలు కలిసినట్టు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తాను.ఎన్నికల్లో పోటీ చేయను.ప్రతిరోజు నా నిజాయితీని నిరూపించుకోవాల్సి వస్తోంది.టిడిపి నేతలు కలిసినట్లుగా నిత్యం నాపై నిందారోపణలు చేశారు అంటూ యర్లగడ్డ వెంకట్రావు తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆవేదన చెందారు.ఇక త్వరలోనే చంద్రబాబును( Chandrababu Naidu ) కలుస్తానని , అపాయింట్మెంట్ ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నా అంటూ మీడియా సమావేశంలో యర్లగడ్డ వెంకట్రావు అన్నారు.
ఇక త్వరలోనే ఆయన వైసీపీకి రాజీనామా చేయబోతున్నారనే విషయంలో క్లారిటీ వచ్చింది.







