ఢిల్లీ పోలీసులు( Delhi Police ) ఇటీవలే ఓ దొంగను అరెస్టు చేసి, విచారణ చేయగా ఆ దొంగ( Thief ) చరిత్ర చూసి అక్కడ ఉండే పోలీసులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఆ దొంగ ఓ పెద్ద హోటల్ యజమాని, ఒక పెద్ద ఇల్లు, ఒక పెద్ద గెస్ట్ హౌస్ తో పాటు భారీగా ఆస్తులు ఉన్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని కోట్ల ఆస్తికి అధిపతి.ఈ దొంగ ఇప్పటివరకు 200 దొంగతనాలు చేసి తొమ్మిది సార్లు అరెస్ట్ అయ్యాడు.
ఇక్కడ మరో టెస్ట్ ఏమిటంటే.? ఇతను దొంగ అనే విషయం కనీసం ఇతని కుటుంబ సభ్యులకు కూడా తెలియదు.ఈ విషయాలు విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు.ఈ దొంగకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.ఉత్తరప్రదేశ్ లోని( Uttar Pradesh ) సిద్ధార్థ నగర్ కు చెందిన మనోజ్ చౌబే( Manoj Choubey ) కుటుంబం నేపాల్ లో స్థిరపడింది.1997లో మనోజ్ ఢిల్లీలోని కీర్తి నగర్ పోలీస్ స్టేషన్ లో క్యాంటీన్ నిర్వహించాడు.ఇక్కడే దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు.
జైలు నుండి బయటకు వచ్చిన మనోజ్ పెద్దపెద్ద ధనవంతుల ఇళ్ళను టార్గెట్ చేసి, దొంగలించిన డబ్బుతో నేపాల్ లో( Nepal ) ఒక హోటల్ నిర్మించాడు.వ్యక్తిగత జీవితానికి వస్తే తాను ఢిల్లీలో పార్కింగ్ కాంట్రాక్టు పనులు చేస్తుంటానని చెప్పి ఉత్తర ప్రదేశ్ లో ఉండే ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమార్తెను వివాహం చేసుకున్నాడు.
ఇక కాంట్రాక్ట్ పనుల కోసం ఢిల్లీకి వెళ్తుంటానని, ఎన్ని రోజులు ఢిల్లీలో ఉండాల్సి వస్తుందో తనకే తెలియదని భార్యను చాలా చక్కగా మ్యానేజ్ చేసేవాడు.

భార్య పేరు పై కూడా ఒక చక్కటి గెస్ట్ హౌస్( Guest House ) నిర్మించాడు.ఒక స్థలం కొని ఆసుపత్రికి లీజ్ కు ఇచ్చి, నెలకు రెండు లక్షల అద్దెను పొందుతున్నాడు.లక్నోలో ఒక సొంత ఇల్లు కొన్నాడు.
ఇలా దొంగతనాలు చేస్తూ కుటుంబ సభ్యులకు తాను దొంగ అని తెలియకుండా ఇలా కోట్లల్లో ఆస్తులు కూడా బెట్టాడు.గత 25 ఏళ్లుగా దొంగతనాలు చేస్తూ లగ్జరీగా జీవిస్తున్నాడు.
ఒకవేళ దొంగతనం చేసి పట్టుబడితే సాక్షాలు లేకుండా చేయడం, అసలైన వివరాలు చెప్పకపోవడం లాంటి కారణాలతో దొంగతనాల కేసు నుండి సులభంగా బయటపడేవాడు.దొంగలించిన సొమ్ముకు రూపం మార్చేసి అమ్మేసేవాడు.
కొద్దిరోజుల క్రితం మోడల్ టౌన్ పోలీసులు ఓ ఇంటిలో చోరీకి పాల్పడ్డాడనే ఆరోపణలతో మనోజ్ ను అదుపులోకి తీసుకున్నారు.విచారణలో అసలు నిజాలు వెలుగులోకి రావడంతో పోలీసులే షాక్ అయ్యారు.







