జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఎవరికో..హైదరాబాద్లో మంతనాల వెనుక రహస్యం..?

గత కొంతకాలం నుంచి బిఆర్ఎస్ జనగామ ( Janagama ) ఎమ్మెల్యే చుట్టూ వివాదాలు నెలకొంటున్నాయి.తన సొంత కూతురే ఆయనపై తిరుగుబాటు జెండా ఎగరవేసింది.

 Janagama Brs Mla Ticket To Whom The Secret Behind The Discussions In Hyderabad,-TeluguStop.com

ప్రస్తుతం బిఆర్ఎస్ లో ఉండేటువంటి క్యాడర్ అంతా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వ్యతిరేకంగా సభలు, సమావేశాలు పెడుతున్నారు.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ( Mutthireddy Yadagiri reddy ) కి సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండా ఎగరవేయడంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారట.

త్వరలో బిఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థుల జాబితా తయారు చేస్తుండడంతో, కొంతమంది ముత్తిరెడ్డి కి వ్యతిరేకంగా హైదరాబాదులో ఒక ప్రైవేటు హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేశారట.

Telugu Hyderabad, Janagama, Mla Ticket, Mutthiyadagiri, Pallarajeshwar-Politics

ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ముఖ్య నేతలంతా హాజరయ్యారట.ఈ విషయం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలుసుకొని హోటల్ కు చేరుకున్నారట.ఎవరి ఆధ్వర్యంలో మీరు రహస్య భేటీ ఏర్పాటు చేశారని నిలదీశారట.

దీంతో అక్కడికి వచ్చిన కీలక నేతలంతా మీతో అవసరం లేదని, మీకు చెప్పాల్సిన పని కూడా లేదని మొహం మీద చెప్పినట్టు తెలుస్తోంది.

Telugu Hyderabad, Janagama, Mla Ticket, Mutthiyadagiri, Pallarajeshwar-Politics

అధిష్టానం పిలుపు మేరకే తామంతా ఇక్కడికి వచ్చామని నువ్వు ఏదైనా చెప్పాలి అనుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ( Kcr ) వద్దకు వెళ్లి చెప్పుకోండి అంటూ చెప్పేశారట.వారలా మాట్లాడడంతో యాదగిరిరెడ్డి అవమానంతో వెనుతిరిగి వెళ్లిపోయారని తెలుస్తోంది.దీన్ని బట్టి చూస్తే మాత్రం రాబోవు ఎన్నికల్లో జనగామ అసెంబ్లీ టికెట్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కి రాదనే అర్థమవుతుంది.

దీన్ని అదునుగా చేసుకున్న కొంత మంది బిఆర్ఎస్ లోని కీలక నేతలు టికెట్ పై కన్నేశారు.ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పల్లా రాజేశ్వర్ రెడ్డి ( Palla Rajeshwar reddy ) మరొకరు పోచంపల్లి శ్రీనివాస్ ఈ టికెట్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారట.

ఈ పరిస్థితులు చూస్తే మాత్రం ముత్తిరెడ్డి రాజకీయ జీవితం జనగామలో ముగిసినట్టే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube