యాదాద్రి భువనగిరి జిల్లా:జిల్లాలో కల్తీ పాల( Adulterated milk ) దందా కంటిన్యూ అవుతోంది.కొందరు పాల వ్యాపారుల కాసులకు కక్కుర్తిపడి ఆరోగ్యం కోసం తీసుకునే లలో విష పదార్థాలను కలిపి కాలకూట విషంగా మార్చి ప్రజలకు సరఫరా చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
జిల్లా ఎస్ఓటి పోలీసులు కల్తీ పాల దందాను అరికట్టడం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తూ, మెరుపు దాడులు చేసి కేటుగాళ్లను కటకటాల వెనక్కి పంపినా కల్తీ పాల మరోచోట కల్తీ పాల వ్యవహారం వెలుగులోకి వస్తుంది.
నెలలవ్యవధిలోనే కల్తీ పాల కేసులు బయటికి రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
తాము రోజూ ఇష్టంగా తీసుకుంటున్న పాలు, పెరుగు విషపూరితమా కదా తెలియక అసలు పాలు కొనాలా వద్దా అనే అయోమయంలో పడ్డారు.ఈ నేపథ్యంలో శుక్రవారం చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామంలో కల్తీ పాలను తయారు చేస్తున్న పాల వ్యాపారి కండ్లకట్ట మల్లారెడ్డి( Mallareddy )ని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జిల్లాలో కలకలం రేపుతోంది.
అతని వద్ద నుండి 60 లీటర్ల కల్తీ పాలను,500 మి.లీ హైడ్రోజన్ పెరాక్సైడ్( Hydrogen peroxide ), 4 కేజీల దోల్పూర్ స్కిమ్ పాల పౌడర్ ను స్వాధీనం చేసుకొని,నిందితుడిని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు.అయితే పాలను కల్తీ చేస్తున్న వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తే మరొకరు ఇలాంటి ఆలోచన చేయడానికి భయపడతారని జిల్లా ప్రజలు అంటున్నారు.







