దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటి రాధిక ( Radhika ) ఒకరు.ఈమె ఎన్నో తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
తెలుగు తమిళ భాష చిత్రాలలో స్టార్ హీరోలందరి సరసన నటించిన రాధిక ఎంతో మంచి సక్సెస్ సినిమాలను అందుకోవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను అలాగే అరుదైన అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.ఇలా నటిగా ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం ఏమే తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు.సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమా అవకాశాలతో రాధిక ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈమె సినిమాలు మాత్రమే కాకుండా బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు.అలాగే పలు బుల్లితెర సీరియల్స్ కు నిర్మాతగా వ్యవహరించడం బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు.
ఈ విధంగా రాధిక ఇండస్ట్రీలో కొనసాగుతూ 45 సంవత్సరాల పూర్తి చేసుకోవడం విశేషం.ఇలా నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 45 వసంతాలు పూర్తి కావడంతో తన భర్త శరత్ కుమార్ ( Sharath Kumar ) తో కలిసి కేక్ కట్ చేసే సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ విధంగా రాధిక తన సినీ కెరియర్లో 45 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక రాధిక మొదటిసారి 1978 వ సంవత్సరంలో దర్శకుడు భారతీయ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన కిళ్ళక్కే పోగుమ్ రయిల్ అనే సినిమా ద్వారా ఈమెను హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.అప్పట్లో ఈ సినిమా ఎవర్ గ్రీన్ హిట్ సినిమాగా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.ఇలా రాధిక సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలు ఉన్నాయని చెప్పాలి.
ఇక తెలుగులో కూడా ఈమె స్టార్ హీరోలు అందరికి సరసన నటించి ఇక్కడ కూడా అదే స్థాయిలో స్టార్డం సొంతం చేసుకున్నారు.