వైరల్: బైక్‌ను కారుగా మార్చేసిన చదవని ఇంజనీర్... కుళ్ళుపోతున్న చదివిన ఇంజనీర్స్?

భారత దేశంలో దాదాపు తొంబై శాతంమంది జనాలు మధ్యతరగతికి చెందినవారే.వీరు తమతమ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడరు.

 Man Turns Bike Into Car Video Viral Details, Bike, Turns, Car, Viral Latest, New-TeluguStop.com

తమకున్న కనీస వెసులుబాటుతోనే తమ తమ కోరికలను తీర్చుకుంటూ వుంటారు.ఈ క్రమంలో ఎంతోమంది మరెన్నో ప్రయోగాలు చేసి హీరోలుగా నిలిచారు.

తాజాగా అలాంటి ఓ టాలెంటెడ్ పర్సన్( Talented Person ) గురించి సోషల్ మీడియాలో షేక్ అవుతోంది.ఇంటర్‌నెట్‌ వినియోగం విరివిగా పెరగడంతో సోషల్ మీడియా వేదికగా ఎక్కడెక్కడో ఉన్న సృజనాత్మక వ్యక్తులు ఈ ప్రపంచానికి పరిచయమవుతున్నారు.

అవును, ఓ వ్యక్తి తాజాగా సాధారణ బైకును కారులా మార్చేస్తూ అందరికీ షాక్ ఇచ్చాడు.అది వెనుక నుంచి చూస్తే.కారులా, ముందు నుంచి చూస్తే.ఒకే టైర్‌తో నడుస్తున్న ఆటోలా, అదేవిధంగా దూరం నుంచి చూస్తే అచ్చం కారులా( Car ) కనిపించే ఒక వాహనాన్ని సృష్టించాడు.

చూసేందుకు అది ఏ మాత్రం బైకులా( Bike ) అనిపించటం లేదంటే మీరు నమ్ముతారా? దానికోసం బైక్‌కు కారు బాడీని అమర్చాడు.బైకు టైర్లు కాకుండా దానికి మరోవైపు మూడో టైరును ఏర్పాటు చేయడం విశేషం.

అలాగే బైకు పక్కనే మరో ఇద్దరు కూర్చునేందుకు వీలుగా సీట్లు కూడా అమర్చాడు.

దాంతో ఆ బైకు రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి.వెనుక నుంచి చూసినా, ముందు నుంచి చూసినా అచ్చం కారులా కనిపిస్తుంది.ఇది కారే అని భ్రమింపజేసాలా అతగాడు దాన్ని తీర్చిదిద్దాడు.

అదేవిధంగా కారుకు డిక్కీ ఉన్నట్టుగా వెనుక వైపు లగేజీ పెట్టుకునేందుకు కూడా ప్రత్యేకించి డిజైన్ చేశాడు.దాంతో అక్కడి స్థానికులు కారు కాని కారును.

వింతగా చూస్తున్నారు.ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట దూసుకుపోవడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

దాన్ని చూసిన ఒక నెటిజన్… “ఓ చదవని ఇంజనీర్ బైక్‌ను కారుగా మార్చేయగా చదివిన నాలాంటి ఇంజనీర్స్ కుళ్లిపోతున్నారు” అంటూ కామెంట్ చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube