'జైలర్' గ్రాండ్ సక్సెస్.. ఫోన్ చేసి మరీ కంగ్రాట్స్ చెప్పిన విజయ్ దళపతి!

సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.రజినీకాంత్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”జైలర్”.

 Thalapathy Vijay Speaks To Nelson Dilipkumar Over A Call Rajinikanth's Jailer Su-TeluguStop.com

( Jailer Movie ) ఈ మధ్య కాలంలో రజినీకాంత్ సినిమాల్లో బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా లేదు అనే చెప్పాలి.అయితే ఈసారి జైలర్ మాత్రం బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తుంది.

ఆగస్టు 10న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాపై ముందు నుండి భారీ హైప్ నెలకొనగా దానికి తగ్గట్టుగానే ప్రీమియర్స్ నుండే ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.

సూపర్ స్టార్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ తో వచ్చాడు.ఇక ఈ సినిమా ఫస్ట్ డే ఓపెనింగ్స్ కలెక్షన్స్ కూడా కుమ్మేసింది.

మరి జైలర్ సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడంతో ఈ డైరెక్టర్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు స్టార్ హీరో విజయ్ దళపతి( Thalapathy Vijay ) ఫోన్ చేసి మరీ కంగ్రాట్స్ చెప్పినట్టు తెలుస్తుంది.జైలర్ ఘన విజయం సాధించడంతో విజయ్ ఫోన్ కాల్ చేసి విష్ చేశారట.వీరి కాంబోలో బీస్ట్ వంటి ప్లాప్ వచ్చిన విజయ్ తన బెస్ట్ విషెష్ అందించడంతో ఈ విషయంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక జైలర్ సినిమాకు వరుస సెలవులు కలిసి వచ్చే అంశం.వీకెండ్ లోనే కుమ్మేసే కలెక్షన్స్ రాబట్టనుంది.ఆ తర్వాత స్వాతంత్య దినోత్సవ హాలిడే కూడా కలిసి వచ్చే అంశం.ఇక సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాలో తమన్నా భాటియా( Tamannaah Bhatia ) హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించారు.

చూడాలి వీకెండ్ గడిచే సమయానికి ఈ మూవీ ఎంత రాబడుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube