టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని ఓ రేంజ్ లో దూసుకుపోతున్న గ్లామర్ బ్యూటీ సమంత( Samantha ).ఈ హాట్ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తన నటనతో మంచి పేరు సంపాదించుకున్న సమంత తన గ్లామర్ లుక్ తో మాత్రం కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది.అతి తక్కువ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదా ను సంపాదించుకుంది.
తొలిసారిగా ఏం మాయ చేశావే( em maya chesava ) సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను నుండి మార్కులు సంపాదించుకుంది.
అంతేకాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా కొంత ఫాలోయింగ్ సొంతం.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లిందనే చెప్పాలి.
చాలా వరకు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.ఇక తనతో కలిసి నటించిన నాగచైతన్యతో( Naga Chaitanya ) ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
విడిపోయిన సంగతి కూడా తెలిసిందే.నిజానికి పెళ్లి తర్వాత సమంత అవకాశాలతో గాల్లోకి ఎగిరిందని చెప్పవచ్చు.
ఎందుకంటే పెళ్లి తర్వాత సమంత సినిమాలలో మరింత క్రేజ్ సంపాదించుకుంది.వెండితెరపైనే కాకుండా ఓటీటీ ఆహా లో సామ్ జామ్( Sam Jam ) అనే షోకు కూడా హోస్టింగ్ చేసింది.
సొంతంగా వ్యాపారాలు కూడా ప్రారంభించింది.పలు బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నిలిచింది.
అలా తన కెరీర్ జీవితం, పెళ్లి జీవితం సజావుగా సాగుతున్న సమయంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన పెళ్లి జీవితానికి ముగింపు పలికింది సమంత.దీంతో ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది.చాలా వరకు సమంత పైనే విమర్శలు చేశారు.ఇక మొత్తానికి ఇద్దరు విడిపోయి తమ తమ కొత్త జీవితాలతో బిజీగా మారారు.విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది సమంత.తనకు అక్కినేని ఫ్యామిలీతో( Akkineni family ) సంబంధం కట్ కావటంతో తన క్లీవేజ్ షో లకు అడ్డు చెప్పేవాళ్లే లేరని చెప్పాలి.
ఇక ఈమధ్య ఆమె వరుస సినిమాల్లో నటించగా ఆ సినిమాలు అంత సక్సెస్ కాలేకపోయాయి.పైగా ఆ సినిమాల విడుదలకు జోరుగా ప్రమోషన్స్ లో కూడా పాల్గొంది.
అయితే ప్రస్తుతం తన హోప్స్ అన్ని తను నటించిన ఖుషి సినిమా పైన ఉన్నాయని చెప్పాలి.విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
మంచి లవ్ రొమాంటిక్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదల కాగా ప్రేక్షకులు ఈ సినిమాపై కొంతవరకు అంచనాలు పెంచుకున్నారు.అయితే ఈ సందర్భంగా సినీ బృందం ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.అంతేకాకుండా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు.కానీ సమంత మాత్రం ప్రమోషన్స్ లో కూడా యాక్టివ్ గా లేదు.రీసెంట్ గా ఆమె ఒక ఏడాది సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.ఆరోగ్యపరంగా రెస్ట్ తీసుకోవాలని అనుకుందని తెలిసింది.
కానీ బ్రేక్ తీసుకొని బాగా వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంది.అయితే ఖుషి సినిమా ప్రమోషన్స్ లో కాస్త పాల్గొన్న కూడా సరిపోయేది అని జనాలు అనుకుంటున్నారు.
కానీ తను మాత్రం ఎటువంటి రెస్ట్ తీసుకోకుండా బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది.అయితే తాజాగా తన పెంపుడు జంతువులతో ఆడుకుంటున్న ఫోటోలు పంచుకోగా.
అక్కడ ప్రమోషన్స్ లో పాల్గొంటే సినిమాపై కాస్త హోప్స్ అయిన పెరుగుతాయి కదా ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.