ఓటిటిలోకి వచ్చేసిన ఆదిపురుష్.. ఎందులో అంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) రాఘవుడిగా మారి నటించిన భారీ మైథలాజికల్ మూవీ ”ఆదిపురుష్”.( Adipurush )ఈ సినిమా ఎన్నో అంచనాలను క్రియేట్ చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసారు.

 Prabhas Adipurush Ott Release, Adipurush, Prabhas, Saif Ali Khan, Om Raut, K-TeluguStop.com

రామాయణం ఆధారంగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమా జూన్ 16న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి మిశ్రమ టాక్ తెచ్చుకుంది.

ఈ టాక్ ప్లాప్ దిశగా కొనసాగింది.మొదటి మూడు రోజులు టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టగా ఆ తర్వాత భారీ పతనం స్టార్ట్ అయ్యింది.ఆదిపురుష్ సినిమాను అట్టర్ ప్లాప్ నుండి ప్రభాస్ కూడా కాపాడలేక పోయాడు.

దీంతో ఈ సినిమా కొన్ని కోట్ల నష్టాలను నిర్మాతలకు మిగిల్చింది.బాక్సాఫీస్ వద్ద అభిమానులను నిరాశ పరిచిన ఈ మూవీ విజయం అందుకోలేక పోయింది.

ఇక థియేటర్ రన్ ఎప్పుడో ముగిసిన ఇప్పటి వరకు ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కాలేదు.దీంతో ఓటిటి చూడాలని సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.సినిమా ప్లాప్ అయినప్పటికీ మూవీ ఒక్కసారైన చూడాలని అనుకునే వారంతా ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.మరి ఈ క్రమంలోనే ఆదిపురుష్ సినిమా తాజాగా ఓటిటిలో రిలీజ్ అయ్యింది.

ఒకటి కాదు రెండు ప్లాట్ ఫామ్ లలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.ఆదిపురుష్ సినిమాను అమెజాన్ ప్రైమ్ ( Amazon Prime )లో తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ వెర్షన్స్ లో స్ట్రీమింగ్ కాగా ఒక్క హిందీ వర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరి అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆదిపురుష్ ఓటిటి లోకి వచ్చేసింది.చూడాలి ఇక్కడైనా ఆశించిన వ్యూస్ రాబడుతుందో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube