నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) ఈ వయసులో కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకు పోతున్నాడు.
ఈ ఏడాది ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ఇప్పుడు మరో సీజన్ ను కబ్జా చేయడానికి రెడీ అయ్యాడు.ఈ ఏడాది దసరా కానుకగా మరో సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి”.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అవ్వగా కొద్దిరోజుల క్రితం భగవంత్ కేసరి టీజర్ రిలీజ్ చేయడంతో మరిన్ని అంచనాలు పెంచేశారు.
ఒక్క టీజర్ తోనే అనిల్ బాలయ్యను ఎంత పవర్ఫుల్ గా చూపించ బోతున్నాడో అర్ధం అయ్యేలా తెలిపాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే ఈ మూవీ నుండి రిలీజ్ డేట్ ను మేకర్స్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేసారు.దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు ఇంకా 70 రోజులు మాత్రమే ఉందని పవర్ఫుల్ బాలయ్య పోస్టర్ తో మరోసారి తెలిపారు.

ఇలా ఇప్పటి నుండి ఏదొక అప్డేట్ ఇస్తూ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) హీరోయిన్ గా నటిస్తుండగా విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు.ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.కాగా ఈ సినిమాను ఫాస్ట్ గా షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయాలని అనిల్ భావిస్తున్నాడు.







