వేస్ట్ ప్లాస్టిక్ మెటీరియల్ తో దుస్తులు తయారు చేస్తున్న ఇండియన్‌ కంపెనీ!

ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా ప్లాస్టిక్‌ ( Plastic )వినియోగం అనేది అంతకంతకు పెరిగిపోతోందే తప్ప, తగ్గడం లేదు.నీళ్లు తాగేందుకు ప్లాస్టిక్ బాటిళ్లను, పాకెట్స్ ని విరివిగా వాడుతున్నారు.

 Indian Company Making Clothes From Waste Plastic Material! Indian Company , Late-TeluguStop.com

ఇక సామానులు కొనడానికైతే ప్లాస్టిక్ బాగ్ ఉండాల్సిందే.లేదంటే ఆ షాపుకి జనాలు వెళ్లే పరిస్థితి ఉండదు.

ఇలా వాటర్ బాటిళ్లు వంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ఎంత హానికరమో ఇక్కడ చదువరులకు చెప్పాల్సిన పనిలేదు.అందుకే ఒక్కసారి ఉపయోగించి విసిరి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి హాని కలిగించ కుండా ఉండేందుకు.

సరికొత్త రీసైక్లింగ్ మార్గం ఒకదానిని కనిపెట్టారు.

Telugu Indian Company, Latest, Surat, Waste-Latest News - Telugu

ఈ క్రమంలో సూరత్‌లో గత 5 సంవత్సరాల నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసి మరీ నూలు తయారు చేస్తున్నారు.దాంతో వివిధ రకాల వస్త్రాలను తయారు చేస్తారు.ఈ ప్లాస్టిక్ బాటిల్ రీసైక్లింగ్ చొరవ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

సూరత్( Surat ) భారతదేశంలో 2వ అతిపెద్ద పర్యావరణ అనుకూల నూలు తయారీ నగరంగా మారింది.ఇక ప్లాస్టిక్ బాటిళ్లతో తయారు చేసిన నూలుకు అయితే డిమాండ్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.

సూరత్‌లోని దాదాపు 3 కంపెనీలు ఈ తరహా నూలును తయారు చేస్తున్నాయి.ఇది 600 కోట్లకు పైగా బాటిళ్లను చూర్ణం చేస్తుందని సమాచారం.

Telugu Indian Company, Latest, Surat, Waste-Latest News - Telugu

ఈ నేపథ్యంలో ప్రతి ఏటా అక్కడ 1,56,000 టన్నుల ఫైబర్‌ను ఉత్పత్తి కాబడుతుంది.ఈ నూలును తయారు చేయడానికి, ప్లాస్టిక్ సీసాలు సేకరించి బాగా క్లీన్ చేస్తారు.తరువాత దాని నుండి రేకులు తయారు చేస్తారు.ఈ రేకుల నుండి నూలు తయారు చేస్తారు.నూలు తయారు చేసే మొత్తం ప్రక్రియలో నీటిని ఉపయోగించరు.కాబట్టి ఈ నూలు తయారీలో నీటిని ఆదా చేసే పని కూడా జరుగుతుందంటున్నారు.

ఇక సూరత్‌లో తయారయ్యే ఈ రకం నూలుకు విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది.ఈ కంపెనీ సూరత్‌లోని ప్లాస్టిక్ బాటిళ్ల నుండి నెలకు 5 నుండి 5 టన్నుల ఫైబర్‌ను ఉత్పత్తి అవుతుందంటే మీరు నమ్ముతారా?నిజం… ఇలాంటి సీసాలనుండి ఉత్పత్తి అయ్యే నూలుతో పాలిస్టర్ ఫాబ్రిక్ ( Polyester fabric )తయారు చేస్తారు.దీనితో తయారైన బట్టలు మన్నికైనవి కాబట్టి, దీర్ఘకాల ఉపయోగం కోసం ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube