కోలీవుడ్ హీరో కార్తీ కి( karthi ) తెలుగులో కూడా సూపర్ ఫాలోయింగ్ ఉంది.సూర్య తర్వాత అతని తమ్ముడు కార్తీ కూడా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.
అయితే కార్తీ తెలుగులో ఊపిరి సినిమా చేశాడు.అతని సినిమాలన్నీ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు.
ఆవారా నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన సర్ధార్ వరకు కార్తీ సినిమాలన్నీ కూడా తెలుగులో మంచి విజయాలు అందుకున్నాయి.అయితే కార్తీని మళ్లీ తెలుగు స్ట్రైట్ సినిమా చేయించాలని చూస్తున్నారు.
కానీ కార్తీకి మాత్రం అలాంటి సినిమా సెట్ అవ్వట్లేదు.
కార్తీ కూడా తెలుగు సినిమా చేయాలనే ఆలోచన ఉన్నా సరే సరైన కాంబినేషన్ కుదరట్లేదని తెలుస్తుంది.
అయితే కార్తితో తెలుగు దర్శకులు ఎవరు సినిమా చేయాలని అనుకున్నా అతని తమిళ( tamil ) ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది.అందుకే కార్తీ తెలుగు డైరెక్టర్స్ తో చర్చలు జరుగుతున్నా సరే వర్క్ అవుట్ అవ్వట్లేదు.
మరి కార్తీ ఫ్యూచర్ లో అయినా సరే తెలుగు స్ట్రైట్ సినిమా చేస్తాడా లేదా అన్నది చూడాలి.మన పక్కింటి పిల్లాడిలా ఉండే కార్తీ తెలుగులో కూడా సూపర్ ఫాలోయింగ్ ఉండగా అతను తెలుగులో సినిమాలు చేయాలని చూస్తున్నారు.