ఏపీలోని తాజా పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.వాల్తేరు వీరయ్య రెండువందల రోజుల ఈవెంట్ లో మంత్రి అంబటికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది.
నేతలు అనే వారు రాష్ట్రం అభివృద్ధి గురించి మాట్లాడాలని చిరంజీవి అన్నారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం మరియు ప్రాజెక్టుల పూర్తి వంటి విషయాల గురించి ఆలోచించాలన్నారు.
పేదల కడుపునింపడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని తెలిపారు.ఇలా చేస్తే అందరూ తలవంచి నమస్కరిస్తారన్నారు.
కానీ అసలు విషయాలు వదిలేసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే ఇదేదో పెద్ద సమస్యలా చూపించొద్దంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అయితే ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.







