మంగళగిరి కోర్టుకు హాజరైన నారా లోకేష్

గుంటూరు: మంగళగిరి కోర్టుకు హాజరైన  నారా లోకేష్. వాంగ్మూలం నమోదు చేస్తున్న న్యాయమూర్తి.

 Nara Lokesh Attended To Mangalagiri Court, Nara Lokesh , Mangalagiri Court, Skil-TeluguStop.com

స్కిల్ డెవలప్మెంట్ స్కాం అంటూ తనపై ఆరోపణలు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డిపై క్రిమినల్ కేసు వేసిన లోకేష్.జిఎస్టి ఎగవేసిన కంపెనీలకు నోటీసులు ఇస్తే స్కిల్ స్కాంపై ఈడి కొరడా అంటూ తనకు సంబంధం ఉందని తప్పుడు రాతలు రాసిన సాక్షిపై నారా లోకేష్ న్యాయపోరాటం.

ఈ కేసులకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన నారా లోకేష్.

వైసీపీ నేతలు పోతుల సునీత, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి తనపై చేస్తున్న ఫేక్ ప్రాపగాండాపై చర్యలు తీసుకోవాలని గతంలో కోర్టును ఆశ్రయించిన నారా లోకేష్.

చినబాబు చిరు తిండి పేరుతో సాక్షి వేసిన కథనం పైనా విశాఖ కోర్టులో పరువు నష్టం దావా వేసిన లోకేష్.తాను తప్పు చేయనని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోనంటూ లోకేష్ గతంలో హెచ్చరించారు.

తనపై బురద జల్లి వెళ్లిపోతానంటే ఊరుకునేది లేదని, నిరాధార ఆరోపణలు చేసే వారందరి పైన న్యాయపోరాటం చేస్తానని నారా లోకేష్ ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube