మంగళగిరి కోర్టుకు హాజరైన నారా లోకేష్
TeluguStop.com
గుంటూరు: మంగళగిరి కోర్టుకు హాజరైన నారా లోకేష్.వాంగ్మూలం నమోదు చేస్తున్న న్యాయమూర్తి.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం అంటూ తనపై ఆరోపణలు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డిపై క్రిమినల్ కేసు వేసిన లోకేష్.
జిఎస్టి ఎగవేసిన కంపెనీలకు నోటీసులు ఇస్తే స్కిల్ స్కాంపై ఈడి కొరడా అంటూ తనకు సంబంధం ఉందని తప్పుడు రాతలు రాసిన సాక్షిపై నారా లోకేష్ న్యాయపోరాటం.
ఈ కేసులకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన నారా లోకేష్.వైసీపీ నేతలు పోతుల సునీత, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి తనపై చేస్తున్న ఫేక్ ప్రాపగాండాపై చర్యలు తీసుకోవాలని గతంలో కోర్టును ఆశ్రయించిన నారా లోకేష్.
చినబాబు చిరు తిండి పేరుతో సాక్షి వేసిన కథనం పైనా విశాఖ కోర్టులో పరువు నష్టం దావా వేసిన లోకేష్.
తాను తప్పు చేయనని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోనంటూ లోకేష్ గతంలో హెచ్చరించారు.
తనపై బురద జల్లి వెళ్లిపోతానంటే ఊరుకునేది లేదని, నిరాధార ఆరోపణలు చేసే వారందరి పైన న్యాయపోరాటం చేస్తానని నారా లోకేష్ ప్రకటించారు.
అమెరికాలో పంజాబీ స్మగ్లర్ కాల్చివేత .. వేటాడి వెంటాడి చంపిన ప్రత్యర్ధులు