ఇకపై ఆ గేమ్స్ పై 28% జీఎస్టీ.. వాటి ప్రభావం ప్రజలపై ఎలా ఉండబోతుందంటే..?!

చాలామంది ఆన్‌లైన్‌లో వివిధ రకాల గేమ్స్( Online Games ) ఆడుతూ ఉంటారు.సరదా కోసం, టైమ్ పాస్ కోసమే ఆన్‌లైన్ గేమ్స్ ఆడే యువత సంఖ్య పెరుగుతూనే ఉంది.

 Casinos Online Gaming And Race Course May Be Subject To 28percent Of Gst Details-TeluguStop.com

ఆన్‌లైన్‌లో రకరకాల గేమ్స్ అందుబాటులోకి వచ్చాయి.టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది కొత్త కొత్త గేమ్స్ వచ్చేస్తున్నాయి.

కొన్ని పెయిడ్స్ గేమ్స్ ఉండగా.మరికొన్ని ఉచితంగా లభించే గేమ్స్ ఉన్నాయి.

ఇండియాలో గేమ్స్ ఆడే యువత మరింత ఎక్కువ మంది ఉన్నారు.క్యాసినో, గుర్రపు పందెం వంటి ఆటలు చాలామంది ఆడుతున్నారు.

దీంతో ఇండియాలో గేమింగ్ రంగం అనేది మూడు పువ్వులు.ఆరు కాయలులా సాగుతోంది.

Telugu Gst, Casino, Casinos, Games, Gst Indian, Latest, Race Games-Latest News -

అయితే ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్ను వసూలు చేయాలని కేంద్రం ప్రభుత్వం చూస్తోంది.జీఎస్టీ( GST ) సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంది.దాదాపు ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది.క్యాసినో,( Casino ) గుర్రపు పందెం( Horse Racing ) వంటి ఆన్ లైన్ గేమ్స్‌లో డబ్బులు పెట్టి ఆడతారు.

దీంతో ఆన్ లైన్ గేమ్‌లో ఖర్చు చేసే డబ్బుకు కూడా జీఎస్టీ విధించాలని చూస్తోంది.దీనికి చట్టబద్దత కల్పించి 28 శాతం పన్ను విధించనుంది.ఈ మేరకు జీఎస్టీ సమావేశంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.ఆన్ లైన్ గేమింగ్‌పై పన్ను రికవరీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.

Telugu Gst, Casino, Casinos, Games, Gst Indian, Latest, Race Games-Latest News -

అమల్లోకి వచ్చిన 6 నెలల తర్వాత దీనిపై కేంద్ర ప్రభుత్వం సమీక్షించనుంది.ఆ తర్వాత వినియోగదారులపై పన్ను ప్రభావం ఎలా ఉంటుందనేది తెలుస్తుంది.ఇప్పటివరకు ఆన్ లైన్ గేమ్స్ లో గేమింగ్ కంపెనీ వసూలు చేసే నగదు లేదా పందెం గెలిచిన తర్వాత గేమర్లు విత్ డ్రా చేసుకున్న డబ్బుపై ఎలాంటి రుసుం ఉండదు.కానీ ఇప్పటినుంచి ఒక్కో మొత్తంపై 28 శాతం పన్ను వసూలు చేయనున్నారు.

దీని వల్ల పేకాట, క్యాసినో లాంటి గేమ్స్ ఆడాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube