తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సీఎం కేసీఆర్ కు రుణమాఫీ గుర్తుకు రావడం సంతోషకరమైన విషయం అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.రుణమాఫీ ఆలస్యం కావడంతో వడ్డీ పెరిగిందని తెలిపారు.
దీంతో రుణమాఫీ మొత్తం వడ్డీకే సరిపోతుందని పేర్కొన్నారు.అన్ని సబ్సిడీలు ఎత్తేసి రైతుబంధు ఇస్తున్నారని మండిపడ్డారు.
ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలని జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే రైతుల నమ్మకాన్ని కేసీఆర్ కోల్పోయారని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కేసీఆర్ మోసం చేయని వర్గం లేదన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్ పథకం కావాలని డిమాండ్ చేశారు.







