వావ్: ఇకపై బట్టలు వాషింగ్ మిషన్ లో వేసే బదులు ఇలా చేస్తే సరి..!

ఇళ్లల్లో ఇప్పుడు వాషింగ్ మెషీన్లను( Washing machines ) అందరూ ఉపయోగిస్తున్నారు.బట్టలు చేతితో ఉతుక్కోవాల్సిన పని లేకుండా ఈజీగా వాషింగ్ మెషీన్ల ద్వారా వాష్ చేసుకోవచ్చు.

 Wow Instead Of Putting Clothes In The Washing Machine It Is Better To Do This De-TeluguStop.com

బట్టలు మిషన్ లోపలి వేసి స్విచ్ ఆన్ ఇస్తే బట్టలు ఉతకడంతో పాటు డ్రై కూడా చేస్తుంది.కంప్లీట్ అయిన తర్వాత ఇంటిపైనే ఆరేసుకుంటే సరిపోతుంది.

అయితే వాషింగ్ మెషీన్లకు ఎక్కువ విద్యుత్, నీరు ఖర్చు అవుతాయి.ఇక వర్షాకాలం వచ్చిందంటే బట్టలు ఆరబెట్టుకోవడం కష్టంగా మారుతుంది.

అయితే వాషింగ్ మెషీన్ అవసరం లేకుండా బకెట్ లో బట్టలు ఉత్కుకోవచ్చు.అదీ కూడా కిచెన్( kitchen ) లో.దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఓ గృహిణి అద్బుతమైన ఈ ట్రిక్ ను కనిపెట్టింది.

వీడియోలో వైరల్ అవుతున్న మహిళ ఓ ప్లాస్టిక్ డబ్బాను( plastic box ) తీసుకుంది.అనంతరం దానికి చిన్న రంధ్రాలను చేసింది.

ఆ తర్వాత డబ్బాకు తాడు కట్టి ఓ చోట వేలాడదీసి బకెట్ లోంచి తడి బట్టలు తీసి ఇందులో వేసింది.ఆ తర్వాత డబ్బాను గుండ్రంగా తిప్పి వదిలేసింది.

డబ్బా తిరుగుతూ రంధ్రం నుంచి నీరు రావడం మొదలైంది.

కొద్దిసేపటి తర్వాత కంటైనర్ నుంచి నీరు నెమ్మదించాయి.ఆ తర్వాత బట్టలను బయటకు తీసి ఆరవేసుకుంటే సరిపోతుంది.ఈ ట్రిక్ వల్ల వాషింగ్ మెషీన్ అవసరం ఉండదు.అంతేకాకుండా కరెంట్ కూడా ఆదా అవుతుంది.2.0 యూట్యూబ్ ఛానెల్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.

ఇటీవల సోషల్ మీడియాలో మహిళలు కనిపెట్టే ఇలాంటి ట్రిక్ లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.ఇటీవల ఓ మహిళ గ్యాస్ మీద ఐరన్ బాక్స్ ను వేడి చూసి ఆ తర్వాత బట్టలను ఇస్త్రీ చేసిన వీడియో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube