పవన్‌ కళ్యాణ్ రాకతో హడావుడి మొదలు పెట్టిన క్రిష్‌!

పవన్ కళ్యాణ్ తాజాగా బ్రో సినిమా( Bro Movie ) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.సినిమా కు మిశ్రమ స్పందన వచ్చినా కూడా వసూళ్లు బాగానే వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

 Pawan Kalyan Krish Hari Hara Veera Mallu Shooting Started,pawan Kalyan, Krish, H-TeluguStop.com

ఆ విషయం పక్కన పెడితే పవన్‌ కళ్యాణ్ పక్కన పెట్టిన హరి హర వీరమల్లు సినిమా ను మళ్లీ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా ను కొన్ని కారణాల వల్ల ఆపేశారు.

ఎన్నికల తర్వాతే హరి హర వీరమల్లు సినిమా( Hari Hara Veera Mallu )ను పూర్తి చేస్తారు అంటూ ప్రచారం జరిగింది.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కు పవన్‌ హాజరు అవుతున్నారు.

Telugu Harihara, Krish, Pawan Kalyan, Tollywood, Ustaadbhagat-Movie

ఈ షెడ్యూల్‌ తో భారీ మొత్తం లో సన్నివేశాలను పూర్తి చేయాలని దర్శకుడు క్రిష్( Director Krish ) భావిస్తున్నాడు.ఈ సినిమాను ముగించడం మాత్రమే కాకుండా ఎన్నికల ముందు వచ్చే విధంగా క్రిష్ ప్లాన్‌ చేస్తున్నాడట.అందుకు గాను పవన్‌ కళ్యాణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి.మొత్తానికి పవన్‌ కళ్యాణ్( Pawan Kalyan ) నుండి హరి హర వీరమల్లు సినిమా కు గ్రీన్ సిగ్నల్‌ అందడంతో దర్శకుడు హడావిడి చేస్తున్నాడు.

సాధారణంగా అయితే పవన్‌ కళ్యాణ్ సినిమా లు చాలా రోజుల పాటు షూటింగ్ జరిగేవి.కానీ ఈమధ్య ఆయన ఎక్కువ సినిమాలు కమిట్ అవుతున్న కారణంగా తక్కువ రోజుల్లోనే సినిమాలను ముగించేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు.

Telugu Harihara, Krish, Pawan Kalyan, Tollywood, Ustaadbhagat-Movie

హరి హర వీరమల్లు సినిమా భారీ బడ్జెట్‌ సినిమా అవ్వడంతో పాటు భారీ పీరియాడిక్ నేపథ్యం లో రూపొందుతున్న సినిమా.అందుకే కాస్త ఆలస్యం అవుతోంది.ఇక పై సినిమా ను ఆలస్యం చేయకుండా స్పీడ్ గా చిత్రీకరించేందుకు గాను పవన్‌ కళ్యాణ్ సిద్ధం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ను ముగించుకుని ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా( Ustaad Bhagat Singh ) షూటింగ్‌ లో కూడా పవన్‌ పాల్గొంటాడు అని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube